సుందిళ్ల, ముస్త్యాలలో బీఎస్పీ పార్టీ ఎన్నికల ప్రచారం. 

నవతెలంగాణ-రామగిరి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగిరి మండలం కెకె నగర్ (వెంకట్రావ్ పల్లి ), సుందిల్ల, ముస్త్యాల, సింగిరెడ్డి పల్లి గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల నారాయణ రెడ్డి, ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ…
మంథని నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు సరైన ఇండ్లు లేక పరదాలు కట్టుకొని  జీవనం గడుపుతున్నారనీ అన్నారు.
మీరు ఓట్లు వేసి గెలిపించిన పుట్ట మధు, శ్రీధర్ బాబు మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతున్నారనీ,మంథని నియోజకవర్గ ప్రజలు, ఓట్లు వేసి బిక్ష పెడితే వాళ్ళు మాత్రం వేలాది ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళీ మనల్ని గొర్రెల్లగా మన ఓట్లను కొనుక్కొని మళ్ళీ గెలవాలని డబ్బుల పెట్టలతో సిద్ధంగా ఉన్నారనీ, బాగా ఆలోచించి నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన వెనువెంటనే పేద ప్రజలకు ఇండ్లు, కార్పొరేటర్ స్థాయిలో వైద్య, విద్య పేదలకు అందేలా  పోరాడుతానని అన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన బీఎస్పీ పార్టీని ఆశీర్వదించి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.