నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 23, 6 వ డివిజన్ లలో ని పద్మ నగర్, హనుమాన్ నగర్, వినాయక్ నగర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకి ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని బుధవారం ప్రజలను కోరారు. నిజామాబాద్ నగర అభివృద్ధి మీ ముందే కళ్ళ ముందే ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శనీయమైన పాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించమన్నారు. నిజామాబాద్ నగరంలో శాంతి యుత వాతావరణం కల్పన కు మొదటి ప్రాధాన్యతనిచ్చామన్నారు. తద్వారా ప్రముఖ కంపెనీలు నిజామాబాద్ నగరానికి వచ్చాయి. ఐటి హాబ్ నిజామాబాద్ నగరానికి మణి హారంగా మారి, స్థానిక యువతకు సాఫ్ట్ వేర్ కొలువులు అందించమన్నారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద ఆర్ యు బి నిర్మాణం చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చామన్నారు. అధునిక సదుపాయాలతో వైకుంఠదామలు నిర్మాణం చేసి అందుబాటులో కి తెచ్చామన్నారు. మీరు మరొకసారి కారు గుర్తుకి ఓటు వేసి దీవిస్తే నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం తో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, ఉమారని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గుజేటి వెంకట నర్సయ్య, పాల్తీ రవి కుమార్, కులచారి సంతోష్,పుట్ట రాజేష్, చిన్నం గంగారెడ్డి, పాక సురేష్, రమన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.