ఓడేడ్ సర్పంచ్ బక్కారావుపై దాడి అప్రజాస్వామికం

– తీవ్రంగా ఖండించింన కాంగ్రెస్
– దాడికి నిరసనగా బంద్ సంపూర్ణం
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని ముత్తారం మండలంలోని ఓడేడ్ గ్రామ సర్పంచ్ బక్కారావు దంపతులపై మహాముత్తారం మండలంలోని మినాజీపేట గ్రామ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు అనూహ్యంగా దాడి చేయడం అప్రజాస్వామికమని, దాడిని మండల కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మండల కాంగ్రెస్  అధ్యక్షుడు బడితేల రాజయ్య, భూపాలపల్లి జిల్లా ఎస్సిసేల్ అధ్యక్షుడు దండు రమేష్,మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ తెలిపారు. తెలంగాణ కాంగ్రేస్ మేనిపేస్టో చైర్మన్,మంథని కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు దాడికి నీరసనగా బుధవారం మండలంలోని తాడిచెర్ల, కొయ్యుర్, మల్లారం, రుద్రారం గ్రామాలతోపాటు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు, దుకాణాలు సంపూర్ణంగా బంద్ చేపట్టినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంథని నియోజకవర్గంలో మహముత్తారంలో ప్రచారం చేసి వస్తుండగా పక్కన తన భార్య ఉందని చూడకుండ దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ గుండాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు, ఇప్ప మొoడయ్య, సంగ్గెం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రవి, నాయకులు కేశారపు చెంద్రయ్య, డిజె శ్రీనివాస్, ఇందారపు ప్రభాకర్, జంగిడి శ్రీనివాస్, జంగిడి సమ్మయ్య, మామిడి కొండయ్య, లింగన్నపేట రమేష్, శ్రీదర్, బూడిద నరేశ్, బొబ్బిలి రాజు, రాగం మహేందర్, కుంట సది, ఆర్ని రాజబాబు, సమ్మయ్య, మదు, సాత్విక్, ఆకుల ఓదెలు, రాములు పాల్గొన్నారు.