ఎస్సీ, కోసంగి, సంఘాలతో సమావేశమైన సీనియర్ నాయకులు లచ్చే వార్ నితిన్

– ఆరు గ్యారంటీగా పథకాల పైన వివరణ
నవతెలంగాణ- రెంజల్: మండలం సాటాపూర్ గ్రామంలో ఎస్సీ, గోసంగి సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లచ్చే వార్ నితిన్టీ ఆరు గ్యారెం పథకాలపై మహిళలకు వివరించారు. రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డిని, అత్యధిక సంఖ్యలో తమ ఓటును సద్వినియోగం చేసుకొని ఆయనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలుగా, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చారే తప్ప నిరుపేదలకు ఆ పథకాలు అందలేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఆరు గ్యారెంటీ పథకాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సీ, గోసంగి, సంఘం నాయకులతోపాటు, మహిళలు పాల్గొన్నారు.