సంక్షేమం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి- ఎమ్మెల్యే పైళ్ల

నవతెలంగాణ- వలిగొండ రూరల్

 పేదలకు సంక్షేమం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పహిల్వాన్ పురం, టేకులసోమారం, ఎదుల్లగూడెం, ప్రోద్దటూరు, మాందాపురం, కంచన పల్లి, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, అక్కంపల్లి, నాతాళ్లగూడెం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించాయని, వారు పదవుల కోసమే తాపత్రయ పడే వారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక ఉద్యమ కారుడే ముఖ్యమంత్రి కావడంతో ప్రజక కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా పేదలకు,రైతులకు సబ్బండ వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి  అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కిందని, వృద్దులకు ఆసరా పెన్షన్, రైతులకు 24 గంటల విద్యుత్, రైతు బందు, రైతు భీమా, రుణ మాఫీ అందజేస్తూ వారికి బాసటగా నిలిచారని, పేదింటి ఆడపడుచులకు క్షళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్, ఇల్లు లేని నిరుపేదలకు గృహాలక్ష్మి, దళితులకు దళిత బంధు, బిసి కులాలకు బిసి బందు ఇలాంటి సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా నిలిచారని, దేశంలోనే ఏ రాష్ట్రంలోనే లేని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు అత్యధిక ఓట్లు వేసి భువనగిరి ఎమ్మెల్యే గా తనను 3 వ సారి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం పహిల్వాన్ పురంలో యువకులు వివిధ పార్టీల నుండి శేఖర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి,  వంగాల వెంకన్న,తుమ్మల వెంకట్ రెడ్డి, సురకంటి వెంకట్ రెడ్డి, పనుమటి మమత నరేందర్ రెడ్డి, పలుసం రమేష్,కీసర్ల సత్తిరెడ్డి ,  ముద్దసాని కిరణ్ రెడ్డి, ఎలిమినేటి జంగ రెడ్డి, బద్దం సంజీవ రెడ్డి, కుసంగి రాములు,మొగుళ్ల శ్రీనివాస్, కునపురి కవిత , వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.