
ప్రస్తుతం పట్టణం, నగరాలకు ఏ పరిమితం అయిన తపాలా సేవలు భవిష్యత్తులో పల్లె పల్లె కు, ప్రతి ఇంటికి చేరాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం సామాజిక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని పాల్వంచ ఎస్.డి.ఐ.పి ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక ఉప తపాలా కార్యాలయంలో బుధవారం ఎస్.పీ.ఎం శ్యాం మహేంద్ర అధ్యక్షతన అశ్వారావుపేట, మరో 17 బ్రాంచి పోస్టాఫీసు ల బీ.పీ.ఎం, ఏ బీ పీ ఎం, జీ.డీ.ఎస్ సిబ్బందితో జరిగిన తపాలా సామాజిక అభివృద్ధి కార్యక్రమానికి (డీ.సీ.డీ.పీ) ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేడు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ పథకం తపాలాతో అనుసంధానం అవుతోందని ఇదొక గొప్ప శుభపరిణామం అన్నారు. దేశ వ్యాప్తంగా తపాలా సేవలు అందని గ్రామం అంటూ లేదని, తపాలా శాఖ కు ఉన్న నెట్ వర్క్ మరే శాఖకు లేదని అన్నారు.పొదుపు పథకాలు, ఇంటి వద్దనే పొదుపు ఖాతాల ప్రారంభం, సొమ్ముల చెల్లింపులు, జీవిత భీమా లాంటి పథకాలతో తపాలా వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. గ్రామీణ తపాలా సిబ్బంది వాటిని ప్రతి ఇంటికి అందేలా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పాల్వంచ మెయిల్ ఓర్ సీస్ శేషు, బీ.పీ.ఎం లు, జీ.డీ.ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.