చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని సాగనంపాలి

– వందపడకల ఆస్పత్రికి కేటాయించిన స్థలం వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన
నవతెలంగాణ-బెజ్జంకి: విద్య, వైద్యం, ఉపాధిపై చిత్తశుద్ధి లేని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. బుధవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన స్థలం వద్ద మండల కాంగ్రెస్ నాయకులు జేరిపోతుల మధు, కత్తి రమేశ్, మానాల రవి, ధోనే వెంకటేశ్వర్ రావు, మెట్ట నాగరాజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేరిపోతుల మధు మాట్లాడుతూ అభివృద్ధి పేరునా ప్రజలను మభ్యపెడుతూ ప్రజాధనం దోపిడీ చేయడమే  బీఆర్ఎస్ నాయకుల ద్యేయమని ఆరోపించారు. మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజనం మున్నాళ్లకే  పరిమితమైందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్య పెడుతూ.. మోసం చేస్తూ..వివక్ష చూపుతూ అధికారం చేలాయిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పెల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.