
నవతెలంగాణ -సుల్తాన్ బజార్: ప్రెషర్ కుక్కర్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గోషామహల్ నియోజకవర్గం ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి బోనాల శ్రీనివాస్ ఓటర్లను కోరారు. బుధవారం గౌలిగూడ ప్రజా ఏక్తా పార్టీ ప్రధాన కార్యాలయం నుండి శంకర్ షేర్ హోటల్, సిద్ధం బజార్ గోల్ మజీద్, భర్తన్ బజార్, స్వస్తిక్ మిర్చి గల్లి, బేగంబజార్ చత్రి, జుమ్మ రాత్ బజార్, చూడి బజార్, పురానాపూల్ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేస్తూ ఓటర్లను కలిసి ఫ్రెషర్ కుక్కర్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే గోషామహల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కార్మికులు, మహిళలు, వ్యాపారులు, యువత, పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. గోషామహల్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఓటర్లకు తెలిపారు. పెద్ద ఎత్తున ఆయనకు ప్రజలు స్వాగతం పలుకుతూ అభినందిస్తూ ఓటు వేస్తామని ప్రజల నుంచి స్పందన భారీగా వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు