నవతెలంగాణ – మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణంలోని 6వ వార్డు శాంతినగర్ ఏరియాలో శనివారం జిల్లా ఎస్పి భాస్కర్ ఆదేశాల మేరకు డిఎస్పి వంగవీటి రవీందర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని, రోడ్డు టాక్స్ సిగ్నల్ జంపింగ్ తదితర పెండింగ్ చాలాన్లు ఉన్న ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది. డి.ఎస్.పి రవీందర్ మాట్లాడుతూ… జిల్లాలో సంఘవిద్రోహచర్యలు జరుగుతున్నాయని సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు సర్చ్ నిర్వహించామన్నారు. ఒక్క శాంతి నగరే కాకుండా పట్టణంలోని అన్ని కాలనీలలో సర్చ్ జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు ఉంచుకోవాలన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అన్నారు. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి యాక్సిడెంట్లను నిర్మూలించాలన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి సీఐ లక్ష్మీనారాయణ, కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్, మెట్ పల్లి,మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్ మండలాలకు సంబంధించిన ఎస్సైలు ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.