కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికల పర్వం

– సాధారణంగా ఆహ్వానించిన శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు పర్వం రోజురోజుకు  జోరుగా కొనసాగుతోంది.గురువారం  మహా ముత్తారం మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్  సీనియర్ నాయకుడు మండల లక్ష్మణ్ తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు  దుద్దిళ్ళ శ్రీను బాబు హస్తం కండువాలు కప్పి  సాధారణంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు, దుద్దిళ్ల శ్రీదర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీనుబాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ జయశంకర్ జిల్లా లింగమల్ల శారద దుర్గయ్య, పిఎస్ సిఎస్ మాజీ చైర్మన్ ముక్కెర రాజమల్లు,ప్రచార కమిటీ కార్యదర్శి చకినల రాజు,మాజీ సర్పంచ్ నరసయ్య, ఉప సర్పంచ్ వేముల మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగమల్ల రాజయ్య, మహా ముత్తారం టౌన్ యూత్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్, గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు చేనాపురి రాజు పాల్గొన్నారు.