– సాగునీటి కోసం రైతుల అవస్థలు. పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయిన గత నాలుగు నెలలుగా పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కందకుర్తి, పేపర్ మిల్లు నీలా గ్రామాలకు సుమారుగా 3366 ఎకరాలకు నీరు అందించేదని వారు పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకం ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా నాలుగు ట్రాన్స్ఫర్ మొదలు పనిచేయడం లేదని, ఐదవ ట్రాన్స్ఫార్మర్ కు రైతులు డబ్బులు జమ చేసి మరమ్మతులు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇటువైపు చూడడం లేదని, దీంతో తమ చేతికి వచ్చిన పంటలు ఎండు ముఖం పట్టాయని వారి పేర్కొన్నారు . గతంలో మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి హయాంలో సిమెంట్ పైపులకు బదులుగా స్టీల్ పైపులను వేయించి శాశ్వత పరిష్కారం చేశారని, ఇంతవరకు అధికారులు రాకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు. రైతులు డబ్బులు జమ చేసుకొని మరమ్మత్తులు చేయించుకుంటున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం పొగాకు, శనగ పంట, నీల గ్రామంలో వరి పంటకు సాగు నీరు అత్యవసరమని, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కల్పించుకొని ఎత్తిపోతల పథకం పున ప్రారంభించాలని వారు పేర్కొన్నారు. రైతులు ఫుర్ఖాన్ బేగ్, ఏ కార్ బేగ్, అజ్మత్ ఖాన్, అయ్యుబ్ బేగ్, షకీల్ బె గ్, హిమాయత్ బేగ్, సలీం బేగ్, అన్సర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.