ఏమి అభివృద్ధి జరిగిందని బీఆర్‌ఎస్‌ కు ఓటు వేయాలి..!

 – ఎమ్మెల్యేగా 2009 నుండి 2018 వరకు వరుస విజయాలు
 – మార్పు కోరుతున్న నియోజకవర్గ ప్రజలు
 – ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు  తో అభివృద్ధి జరుగుతుందా
 – ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పై నమ్మకం సన్నగిల్లింది
 – సిగ్గుపడుతున్న శిలాఫలకాలు
 – పౌరసత్వం వివాదంతో ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు
నవతెలంగాణ – వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ దక్షిణ కాశీగా, హరి హర క్షేత్రం గా ఎంతో ప్రసిద్ధిగాంచిన వేములవాడ అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది.. 18- 6 -2015 లో ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకుని ప్రతి ఏటా వందకోట్ల బడ్జెట్ కేటాయించి ఆగమ శాస్త్రం, శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు దేవాలయ అభివృద్ధి తోపాటు వేములవాడ పట్టణా అభివృద్ధి, నిర్వాసితులకు ఐదు లక్షల 4 వేల రూపాయలు 18 ఏళ్ల నిండిన ప్రతి యువతీ, యువకులకు డబుల్ బెడ్ రూమ్ రాజన్న సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 8 సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఏ ఒక్క హామీ  నెరవేరలేదని పట్టణ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేను 2009 నుండి 2018 వరకు వరుసగా గెలిపిస్తూ వస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల, ఎమ్మెల్యేల మాటలోని హామీలు తప్ప చేతుల మాత్రం శూన్యమని అనుకుంటుర్రు. స్థానిక ఎమ్మెల్యే దేవాలయ అభివృద్ధిని, పట్టణ అభివృద్ధిని గోడల మీద చిత్రాలు, డిజిటల్ తెరలపై దేవాలయ అభివృద్ధి కళాఖండాలను చిత్రపటాలలో నమోలను చూపిస్తూ నియోజకవర్గ ప్రజలను, రాజన్న భక్తులను ఊహలోకంలో తెలియాడేలా మంత్రముగ్ధులను  చేస్తూనే ఉన్నారు. అభివృద్ధి వీ టీ డీ ఏ ఏర్పాటు తప్ప దిశగా ఏ ఒక్క ఇటిక రాయి పడలేదని తెలంగాణ ఏర్పాటైన నుండి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ రెండుసార్లు వచ్చి రాజన్నను దర్శించుకున్నారు, దేవాలయ పురోగతిపై ఎలాంటి మాట ఊసే లేదు..స్థానికంగా ఉండవలసిన ఎమ్మెల్యే లేకపోవడమే అభివృద్ధికి వెనుక బాటఅని ప్రజల నుండి వస్తున్న ఆరోపణలు. ఏడు సంవత్సరాల కాలంలో దేవాలయ గుడి చెరువును 35 ఎకరాలు పూడ్చారు తప్ప వేరే అభివృద్ధిని లేదు. దేవాలయ నిధులతోనే బద్ది పోచమ్మ చుట్టూ ఉన్న ఎకరం స్థలం నివాసాలను తొలగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరు నెలలు జర్మనీలో.. మరో ఆరు నెలలు నియోజకవర్గంలో ఉంటారని ఆయనను టూరిస్ట్ ఎమ్మెల్యేగా వేములవాడ నియోజకవర్గ ప్రజలు ముద్దుగా సంబోధిస్తారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడం జిల్లా మంత్రితో సఖ్యత లేకపోవడం ఒక కారణమని ప్రజలు అనుకుంటున్నారు. నేడు జరుగుతున్న ఎన్నికలలో జిల్లా మంత్రి కేటీఆర్ రెండు కళ్ళు, నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, అభివృద్ధి నా బాధ్యత వేములవాడని దత్తత తీసుకుంటాను అని హామీలు ఇస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అని ప్రజలు మంత్రి మాటలను విశ్వసించడం లేదని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. తొమ్మిది ఏళ్లుగా జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు, ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పరాజయం తప్పదని కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం ఉరుకులు పరుగుల మీద   అభివృద్ధి పరుగులు పెడుతుంది, పేరుకే రాజన్న జిల్లా..  అభివృద్ధి అంతా సిరిసిల్లలోని..
సిగ్గుపడుతున్న శిలాఫలకాలు..
అభివృద్ధి పనులు  జరపడానికి  శిలాఫలకాలు వేసి పనులను ప్రారంభిస్తారు, 2009 నుండి 2018, నేటి వరకు వేసిన శిలాఫలకాలలో ఏ ఒక్క పనులు పూర్తి కాలేదని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. 2016లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండే విధంగా క్యాంప్ ఆఫీసులను ప్రభుత్వం ఏర్పాటుకు పునాది వేశారు, సిరిసిల్లలో ఉన్న క్యాంప్ ఆఫీస్ పూర్తయి అక్కడి నుండి పరిపాలన జరుగుతుంది. వేములవాడ మాత్రం క్యాంప్ ఆఫీస్ పనులు పూర్తికాక బోసిపోయి ఉంది, క్యాంప్ ఆఫీస్ పూర్తి పూర్తి చేసుకోలేని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రజలకు ఏమి చేస్తారని ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో హామీలను పూర్తిచేసి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని కొత్తగా వాగ్దానాలు, హామీలను గుప్పిస్తున్నారు.. ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుతో అభివృద్ధి జరుగుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..? నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై ప్రజలు,  కార్యకర్తల్లోనూ అసంతృప్తితో ఉన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మార్పు తప్పదని ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీ బీఎస్పీ అభ్యర్థి లా వైపు చూస్తున్నారు.
పౌరసత్వం వివాదంతో ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు..
రాష్ట్రంలో, నియోజకవర్గంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుకు పేరుంది, కానీ స్థానికంగా ఉండడని అపవాదు, పారసత్వ వివాదం ఉండడంతో పార్టీ అధిష్టానం నేడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ కేటాయించారు. ఎమ్మెల్యేను కాదని చల్మెడ కు కేటీఆర్ ప్రోత్బలంతో టికెట్ వచ్చేలా చేశారని రమేష్ బాబు, అభిమానులు కార్యకర్తలు వీరాభిమానులు భావిస్తున్నారు.  చల్మెడ మీద వ్యతిరేకతను, సిట్టింగ్  ఎమ్మెల్యేగా లేని బీఆర్‌ఎస్‌ చూడలేక ఆయన వీర అభిమానులు కాంగ్రెస్, బీజేపీ లలో  చేరిపోతున్నారు.