స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించా

 – నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యేగా
– అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగాను
– అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాను
– మహిళా డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తా
– ప్రజలు ఆలోచనతో ఓటేయాలి
– అభ్యర్థులు చెప్పేవాటిని బేరీజు వేసుకొని గతానికి ప్రస్తుతానికి తేడా ఏమిటో చూసి ఓటేయాలి
– మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నిజామాబాదు అర్బన్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్త వ్యాఖ్యలు
నవతెలంగాణ- కంటేశ్వర్: స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరిగిందని మహిళా డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తా  ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును వేయాలని, కానీ అభ్యర్థులు చెప్పే వాటిని బేరీజు వేసుకొని గతానికి ప్రస్తుతానికి తేడా ఏమిటో చూసి ఓటు వేయాలని నిజామాబాద్ అర్బన్ ప్రజలకు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త జిల్లాలకే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఇచ్చారు.. కానీ పాత జిల్లా అయినా కూడా ఇక్కడి కలెక్టరేట్ పరిస్థితి సిఎం దృష్టికి తీసుకువెళ్ళి నూతన కలెక్టరేట్ మంజూరు చేయించి కట్టించాం. తెలంగాణలో హైదరాబాదు తప్ప ఎక్కడా లేనట్టు ప్లాంటేషన్ చేయించాము. నేనెప్పుడూ ప్రజలను దృష్టిలో పెట్టుకునే పనిచేశాను.. నెక్స్ట్ జెనరేషన్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పనిచేశా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయం వదిలేయమని మా పార్టీ వారు చెప్పినా వినకుండా దానిని పూర్తి చేశాను. యూజీడీ లైన్ ఇండ్ల వరకు కనెక్షన్ కోసం సీఎంకు వివరించగా 65 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇది పూర్తయితే డ్రైనేజీల నుండి కేవలం వర్షపు నీటి కోసమే పరిమితమవుతాయి. మిషన్ భగీరథ లైన్ కోసం 20 కోట్లు మంజూరు చేయించా. అర్గుల్ నుంచి నిజామాబాదు వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని తీసుకువచ్చి నగర తాగునీటి సమస్య పరిష్కరిస్తా. మరోసారి గెలిపిస్తే రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా నిజామాబాదును తీర్చిదిద్దుతా. అభివృద్ధి కొనసాగాలన్నా. 24 గంటల నీటి సరఫరా జరగాలన్నా, యూజీడీ పూర్తి కావాలన్నా ప్రజలు బీఆర్‌ఎస్‌ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మెజారిటీ మైనారిటీ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేశాను. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర జర్నలిస్టులు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.