చిట్టాపూర్ సర్పంచ్ విన్నూత కార్యక్రమం

– స్వంత ఖర్చులతో కలర్ పేంటింగ్ పనులు
– పనితీరుపై పలువురి ప్రశంస
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్బరుపేట భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ పోతానక రాజయ్య రోడ్డు ప్రమాదాల నివారణకు విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం గ్రామంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనదారులు, గ్రామస్తులు ప్రమాదాల భారీన పడి కొంతమంది గాయాలపాలు కగా….మరికొందరు మరణించిన సంఘటనలు ఉన్నాయి.ఈ విషయాన్ని గమనించిన చిట్టాపూర్ సర్పంచ్ తన స్వంత ఖర్చులతో ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల దగ్గర రంగులు వేయించారు.సర్పంచ్ పనితీరు చూసి పలువురు అభినందిస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ సెక్రెట్రారీ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు, ఎండీ రఫి,మంతూరి సందీప్, దుంపేట లింగం,దోర్నాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు