కాంగ్రెస్ లోకి చేరికలు జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు చౌటుప్పల్ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసోసియేషన్ అధ్యక్షులు కందాటి జంగారెడ్డి కార్యవర్గ సభ్యులు చామట్ల రాంబాబు, మీసాల దాసు, ఎల్లంకి దిలీప్ చారి, సత్యబోయిన మహేష్, కలగోని వెంకటేష్ గౌడ్, చామట్ల మహేష్, మీసాల సురేష్,షేక్ అజి తదితరులు చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో దండు మల్కాపురం మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి మల్లారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మునుకుంట్ల రాజు గౌడ్, దేప శ్యామ్ సుందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు