నవతెలంగాణ ఆర్మూర్ ;- మండలం లోని మంథని గ్రామ ఎంపీటీసీ మండల ఎంపీటీసీ ల పోరం అద్యక్షుడు గొల్ల గంగారాం యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, తన అనుచరులతో బీజేపీలో శనివారం చేరినారు ఈ సందర్భంగా బి జె పి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంథని కి చెందిన పాపాయి గారి రమేష్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. గంగారాం యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగా ఉండి పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేసేవారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోక పోవడం, పార్టీ కార్యకలాపాల గురించి సమాచారం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందాడు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు గంగారాం యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం కోసం కష్టపడి పని చేస్తానన్నారు. మోడీ చేస్తున్న పనికి ఆకర్షితుడై బిజెపిలో చేరారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, యువ మోర్చా కన్వీనర్ దినేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవి గౌడ్, జైడి శ్రీనివాస్ రెడ్డి, పాపాయి గారి లింగారెడ్డి, బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు.