
– హైదరాబాద్ విద్యార్థులు అడవిలో విహారయాత్ర
నవతెలంగాణ -తాడ్వాయి: విద్యార్థి దశ నుంచే మొక్కలను పెంచడం, పెంచిన మొక్కలను కాపాడడం, అడవులను సంరక్షించడం అని విషయాలపై అవగాహన అవసరమని తాడ్వాయి వన్యప్రాణి విభాగం అటవీ శాఖ అధికారి చౌకత్ అలీ అన్నారు. శనివారం శ్లోక ద వరల్డోరఫ్ హైదరాబాద్ పాఠశాల విద్యార్థుల తోటి ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ ఆదేశాల మేరకు వనదర్శిని ప్రోగ్రాం ద్వారా అడవిలో విహారయాత్ర కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీలు అందరికీ అటవీ యొక్క ప్రయోజనాలు, పర్యావరణం పరిరక్షణ, అడవులు తరుగుదల వలన కలిగే నష్టాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ చౌకత్ అలీ మాట్లాడుతూ అడవుల వలన వర్షపాతం ఎలా ఉంటుందో వివరించారు. విద్యార్థులకు వివిధ మొక్కలను చూపించి అవగాహన కల్పించారు. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం పై ఓ డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. వన్యప్రాణులకు అటవీశాఖ అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు ఉమారాణి, రమాదేవి 8 మంది ఉపాధ్యాయులు, 40 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.