తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పిరమిడ్ ను సందర్శించిన ట్రస్టు సభ్యులు

నవతెలంగాణ ఆర్మూర్ : పట్టణంలోని సిద్దులగుట్ట  నందు నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్  శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం సందర్శించిన మహేశ్వర మహా పిరమిడ్ కడ్తాల్  ట్రస్టు సభ్యులు శ్రీ లక్ష్మీ శనివారం సందర్శించినారు. సుప్రసిద్ధ దేవస్థానం సిద్దుల గుట్టపై నిర్మిస్తున్న ఈ ధ్యాన మందిరం   ఎంతో గొప్పదని, ఎంతో శక్తివంతమైన ధ్యాన మందిరం అని,   నిర్మించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలిపారు.  ఎంతో  శక్తివంతమైన,  ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉన్న ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చేసి  ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా జీవించాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి  ధ్యాన భాగ్యనగరం ట్రస్టు సభ్యులు దూలిపూడి చంద్రశేఖర్ , మిట్టపల్లి గంగారెడ్డి , బొడ్డు దయానంద్ , చిదుర రాజు, అమరవాజి శ్రీనివాస్ , జీకే రమేష్ , రొడ్డ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు..