అనుమానం
రమణి: అదేంటి మీ దుస్తులపై ఎక్కడా ఒక్క తల వెంట్రుక కూడా లేదే..
సుందరం: బతికించావ్. ఇప్పటికైనా నాపై అనుమానం పోయిందా. ఇకనైనా నమ్మకముందా నా మీద.
రమణి: నీపై నమ్మకమా.. పాడా.. అసలు అనుమానం ఇప్పుడే మొదలైంది. దానికి ఏ కంపెనీ షాంపు కొనిస్తున్నావో మర్యాదగా చెబుతావా లేదా?
శాడిస్ట్
క్లాసురూమ్‌లోకి మ్యాథ్య్ టీచర్ వచ్చేసరికి చంటి గురకపెట్టి నిద్రపోతున్నాడు. మిగతా విద్యార్థులు హోంవర్క్ నోట్స్ సబ్మిట్ చేస్తున్నారు..
టీచర్: అరెరు చంటి.. శాడిస్ట్ అంటే ఎవరు..
చంటి: మీరే సార్..
టీచర్: ఎందుకలా..?
చంటి: క్లాసులో లేచి ఉన్న అందరినీ వదిలిపెట్టి.. నిద్రపోతున్న నన్నే లేపి అడగాలా ఏంటి?
రా..యిలా
భర్త: ఏంటి.. అలా కదలకుండా కూర్చున్నావు?
భార్య: మీరే కదండీ, రాయిలా కూర్చోమన్నారు…
భర్త: అయ్యో తింగరిదాన.. నేను అలా అనలేదే, రా… ఇలా కూర్చో అన్నాను
అందంగా…
శ్రీను : తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి
రాణి : అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే
శ్రీను :నువ్వు కాదు డార్లింగ్… నేను తాగినపుడు