
– మాటలతో మభ్య పెట్టేది కాంగ్రెస్ వాళ్ళే
– నాపై వస్తున్న దుష్ప్రచారం కాంగ్రెస్ కుట్ర
– నా జీవితంలో ఏనాడ ఎవరిపై కుట్రలు చేయలేదు
– రేవంత్ పగటి కలలు కంటున్నారు
– విలేకరుల సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ- నల్గొండ: ప్రధాని జాతీయ దృక్పథంతో ఉండాలి కానీ కులాల కుమ్ములాటలు ప్రోత్సహించడం సారి కాదు. కుల..మత వర్గీకరణతో తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాలను, మతాలను విభజించడం దేశ సౌబ్రాతృత్వానికి మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు అందరూ కేసీఆర్ లక్ష్యంగా దండయాత్ర చేస్తున్నారు. బీజేపీ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. విభజన చట్టం లోని హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు మొత్తం తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నా వారు కాంగ్రెస్ వాళ్లు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా నిరాధారా ఆరోపణలు చేస్తున్నారు. శనివారం కూడా పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీని వెనుకాల కాంగ్రెస్ కుట్ర ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు.నా రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరిపైన కుట్రలు చేయలేదు. నల్గొండ జిల్లాలో 12 కి 12 స్థానాలు గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాం.అన్నదాతలు అందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకోవాలి. ఇవ్వాళ వ్యవసాయం పండుగలా మారింది. ఎన్నో పథకాలు తెచ్చిన ముఖ్యమంత్రి కే ఓటు అడిగే హక్కు ఉన్నది. పని చేసి ఓట్లు అడుగుతున్నాం. మాటలతో కాదు. మంగళవారం నుంచి రైతు బంధు డబ్బులు కూడా జమ అవుతాయి. హైకోర్టు తీర్పు హర్షణీయం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారు. ఊహ లోకంలో విహరిస్తున్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణ ఆగం అవుతుంది. ప్రతిపక్షాలకు విజన్ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోనే తెలంగాణ ముందుకు పోతుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు.