నవతెలంగాణ- డిచ్ పల్లి: నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా బీఆర్ఎస్ మహిళలు నడుం బిగించారు.అదివారం ఇందల్ వాయి మండలం లోని ఆయా గ్రామాలలో కచ్చకాయల అశ్విని శ్రీనివాస్ అధ్వర్యంలో గ్రామలలోని ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఈసారి నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టే పథకాలను ప్రజలకు, మహిళలకు వివరించారు. ఏ గ్రామంలో ప్రచారం చేసిన ప్రజలనుండి విశేష స్పందన వస్తోందని వారు వివరించారు.
ఎమ్మెల్యె బాజిరెడ్డి గోవర్ధన్ గత పదేళ్లుగా రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలలో గీతం నుండి అభివృద్ధికి నోచుకోని పనులను శాయశక్తులా కృషి చేసి పూర్తి చేసినట్లు వారన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలి పించాలని ఎంపీటీసీ కచ్చ కాయల అశ్విని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో లోలం, మాల్లపుర్ ఎంపీటీసీ ఢికోండ సరిత సుదిర్, చంద్రాయన్ పల్లి సర్పంచ్ లలిత దాస్, మెగ్యానాయక్ తండ సర్పంచ్ లక్ష్మి, లోలం సర్పంచ్ పత్తి మమత శేఖర్, మేఘ్య నాయక్ తాండ ఎంపీటీసీ లలిత గణేష్ మహిళా జనరల్ సెక్రెటరీ పేరుక కర్ణతో పాటు మహిళలు బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.