
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని పెద్ద దేవి సింగ్ తండా, బూరుగుపల్లి, కాస్లాబాద్, గ్రామాల నుంచి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు సతీష్ యాదవ్, ఆధ్వర్యంలో పలువురు పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగాఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతరపార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులుపెడుతున్నారన్నారు.ప్ రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని వివరించారు.కలిసికట్టుగా పార్టీ కోసం కృషిచేసి గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్‌లో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు. ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సతీష్ యాదవ్, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ తిరుమల్ రెడ్డి, బాన్సువాడ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖండేరావుపటేల్,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గుండె రావు పటేల్, సొసైటీ డైరెక్టర్ దస్తారెడ్డి, ప్రకాష్, అస్రాజ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలోని పెద్ద దేవి సింగ్ తండా, బూరుగుపల్లి, కాస్లాబాద్, గ్రామాల నుంచి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు సతీష్ యాదవ్, ఆధ్వర్యంలో పలువురు పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగాఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతరపార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులుపెడుతున్నారన్నారు.ప్