కాంగ్రెస్ పార్టీలో చేరిన అంబేద్కర్ యూత్ సభ్యులు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం మోర్తాడ్ లోని ప్రజా నిలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అంబేద్కర్ యూత్ సభ్యులకు ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను, మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకెళ్లి ముత్యాల సునీల్ కుమార్ ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. అనంతరం ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సబ్బండ కులాలను ఆదుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, సంక్షేమం సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.