
నవతెలంగాణ-సూర్యాపేట: మజిద్ లలో పని చేసే ఇమామ్, మోజిన్ ల సమస్యల పరిష్కరానికి యూనియన్ పనిచేస్తుందని ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నోమాని ముఫ్తి అబ్దుల్ కాఫీ అస్సార్ అన్నారు. ఆదివారం స్థానిక ఖమ్మం రోడ్డు లో గల మాగ్ఫిర మస్జిద్ లో జరిగిన ఇమామ్, మౌజిన్ యూనియన్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి ఇమామ్, మౌజిన్ లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రధానంగా డబల్ బెడ్ రూమ్, లోన్, రేషన్ కార్డ్, హెల్త్ కార్డ్, పెన్షన్ కార్డ్ ఇలాంటి మరెన్నో పథకాలు ఇమామ్, మోజిన్ లకు లాభం చేకూరే విధంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ఇస్లామిక్ చిట్టి ద్వారా వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. ఇదిగాక ఇమామ్, మోజిన్ లకు ప్రత్యేక కార్డు ఏర్పాటు చేసి దీని ద్వారా అన్ని గృహపకరణాలు హోల్సేల్ ధరలకే పొందేవిధంగా చేయాలని కోరారు. బైతుల్ మాల్ లో డబ్బులు జమ చేసి వాటి ద్వారా కాలానుగుణంగా ఏమన్నా అత్యవసర పరిస్థితులలో పనికి వచ్చే విధంగా ఉపయోగించే విధంగా కృషి చేయాలన్నారు. చెప్పిన విషయాల పై సమావేశంలో అందరూ సంతృప్తి చెంది ఏకీభవిస్తున్నట్టు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అందరూ కలిసి అబ్దుల్ కాఫీ అస్సార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మౌలానా రఫీ ఉద్దీన్ ఇమామ్ వా ఖతిబ్ మజ్జిదే బిలాల్ బిలాల్, మౌలానా అమ్మార అబిద్ హుస్సామీ ఇమామ్ వా ఖతిబ్ మదీనా మజీద్, ముఫ్తి అబ్దుల్ నాఫీ ఉసామా ఆల్ సాది ఇమామ్ వా ఖతిబ్ మజ్జిదే మాగ్ఫీరా, మౌలానా అబ్దుల్ వాసి సుమామా ఇమామ్ వా ఖతిబ్ మజ్జిదే అజిజా ఖాసీం, మౌలానా యాసర్ అబ్రార్ ఇమామ్ వా ఖతిబ్ మజ్జిదే ఆరిఫా, మౌలానా ఫైసల్ ఇమాం వా ఖతిబ్ మజ్జిదేఫాతిమా, ముఫ్తి అబ్దుల్ కాఫీ అస్రార్ రెహమాన్ ఇమామ్ వా ఖతిబ్ మజ్జిదే యుసుఫియా,
మౌలానా అబ్దుల్ గఫార్ సబిలి ఇమామ్ వా ఖతిబ్ మజ్జిదే మల్కాపూర్, హాఫిజ్ గుల్ రేజ్ ఇమామ్ వా ఖతిబ్ మజ్జిదే కౌసర్, తదితరులు పాల్గొన్నారు.