
నవతెలంగాణ – నెల్లికుదురు
నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరిచిన మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఎంపిటిసి రావు మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో ఆదివారం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతా అభివృద్ధి కోసం పట్టించుకున్న పాపాన పోలేదని నేడు శంకర్ నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా తయారు చేయండి అన్నారు కొంతమంది లేని పోనీ మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు నమ్మవద్దని అన్నారు మరి కొంతమంది వారి స్వార్ధ రాజకీయాల కోసమే పాటుపడుతున్నారని అన్నారు ప్రజలందరూ శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యారని శంకర్ నాయక్ వెంట ఉంటామని ఈ ప్రాంత ప్రజల తెలుపుతున్నారని అన్నారు గతంలో రెండు సార్లు శంకర్ నాయక్ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామం మెజారిటీ ఓట్లు ఇచ్చామని మరి ఈసారి కూడా అధికంగా ఓట్ల మెజార్టీ ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు భూముల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ బొమ్మెర ఎల్లగౌడ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బొమ్మెర అనిల్ గాదె మదార్, ఈశ్వర్, పల్లె వెంకట్రాములు, కర్ర శ్రీనివాస రెడ్డి, గట్టిగొర్ల సింహాద్రి, సముద్రాల వెంకన్న, పబ్బోజు వెంకన్న, గుండెబోయిన వెంకన్న, తరాల వెంకన్న, కర్ర రవీందర్ రెడ్డి, జీలకర్ర దేవేందర్, నాగుల అమృతం, సాయి, మహేష్, మోటాపోతుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.