1. ఈ కింది వాటిలో సరైన అంశాలు గుర్తించండి.
ఎ. అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తారు
బి. అటార్నీ జనరల్ అర్హతలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది
1. బి మాత్రమే 2. ఎ మాత్రమే
3. ఎ, బి 4. ఏదీకాదు
2. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అటార్నీజనరల్ గూర్చి తెలియజేస్తుంది?
1. 72 2. 76 3. 75 4. 78
3. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
1. 25-1-1950 2. 22-1-1950
3. 26-1-1950 4. 19-7-1949
4. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు.
1. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 61వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 69వ రాజ్యాంగ సవరణ చట్టం
5. భారతదేశంలో రాజ్యాంగ బద్ద సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన చట్టాలన్నింటిని రూపొందించేది ఎవరు?
1. రాష్ట్రపతి 2. పార్లమెంట్
3. కేంద్ర ఎన్నికల సంఘం 4. ఏదీకాదు
6. మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
1. రాజీవ్ కుమార్ 2. సుకుమార్ సేన్
3. కెవికె సుందరం 4. నాగేంద్రసింగ్
7. ఎక్కువ రోజులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన వారు?
1. నాగేందర్ సింగ్ 2. వి.ఎస్. రమాదేవి
3. టి.ఎన్. శేషన్ 4. కెవికె సుందరం
8. ఓటుహక్కు వయస్సును 21 సంవత్సరాలనుండి 18 సంవత్సరాలకు తగ్గించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది?
1. దినేష్ గోస్వామి కమిటీ 2. తార్కుండే కమిటి
3. ఇంద్రజిత్ గుప్తా కమిటి 4. లా కమీషన్
9. ఎన్నికలలో జుVవీ లను వినియోగించాలని సిఫార్సు చేసిన కమిటి ఏది?
1. దినేష్ గోస్వామి కమిటి 2. తార్కుండే కమిటి
3. ఇంద్రజిత్ గుప్తా కమిటి 4. లా కమిషన్
10. మొట్టమొదటి సారిగా నోటా (చీఉుA)ను ఏ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు?
1. గోవా 2. కేరళ
3. ఢిల్లీ 4. మిజోరాం
11. ఓటు ఎవరికి వేశారో తెలుసుకొనే పద్ధతిని తొలిసారి ఏ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు?
1. నాగాలాండ్ 2. మణిపూర్
3. ఢిల్లీ 4. గోవా
12. మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను ఏ సంవత్సరం లో డిజైన్ చేశారు?
1. 1946 2. 1952
3. 1980 4. 1984
13. ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా పనిచేసిన తొలి తెలుగు వారు?
1. విఎస్ రమాదేవి
2. కె. నాగేంద్రసింగ్
3. ఆర్‌విఎస్ పేరిశాస్త్రి 4. కెవికె సుందరం
14. ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన కమీషనర్…
1. ుచీ శేషన్ 2. జీవి లింగ్డో
3. రమాదేవి 3. ఖVఖ సుందరం
15. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఖర్చులు, ఖాతాల ఆడిట్, నివేదికను ఎన్నికలు ముగిసిన ఎన్నిరోజుల లోపు కమీషన్‌కు సమర్పించాలి.
1. 30 రోజులు 2. 10 రోజులు
3. 15 రోజులు 4. ఏదీకాదు
16. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది.
1. 76 2. 165 3. 156 4. 172
17. కింది వాటిలో అడ్వకేట్ జనరల్ గురించి సరైనది/ సరైనవి గుర్తించండి.
1. అర్హతలు రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
2. గవర్నర్ విశ్వాసం మేరకు పదవిలో ఉంటారు
3. 1Ê2 4. ఏదీకాదు
18. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి అడ్వకేట్ జనరల్ ఎవరు?
1. నరసరాజు 2. ప్రకాశ్ రెడ్డి
3. రామకృష్ణారెడ్డి 4. ఎవరూకాదు
19. కింది వాటిలో సరికానిది/సరికానివి ఏది?
1. రాష్ట్రపతి అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తారు
2. అడ్వకేట్ జనరల్‌ను గవర్నర్ తొలగిస్తారు
3. 1Ê2 4. ఏదీకాదు
20. అటార్నీ జనరల్ అనే పదవిని తొలిసారిగ ప్రవేశపెట్టిన చట్టం ఏది?
1. చార్టర్ చట్టం 1833 2. చార్టర్ చట్టం 1853
3. భారత ప్రభుత్వ చట్టం 1935
4. భారత కౌన్సిల్ చట్టం 1861
21. అటార్నీ జనరల్ వేతనాన్ని నిర్ణయించేవారు?
1. పార్లమెంట్ 2. రాష్ట్రపతి
3. ప్రధానమంత్రి 4. పై ఎవరూకాదు
22. కింది వాటిలో సరైన వాక్యం/ వాక్యాలు ఏవి?
ఎ. అటార్నీ జనరల్ ను పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీతో తొలగిస్తారు.
బి. అటార్నీ జనరల్ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు
1. బి మాత్రమే 2. ఎ, బి
3. ఎ మాత్రమే 4. ఏదీకాదు
23. కింది వాటిలో సరికానిది/ సరికానివి గుర్తించండి.
ఎ. అటార్నీ జనరల్ వేతనాన్ని భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు.
బి. అటార్నీ జనరల్ వేతనం రూ. 2.25,000
సి. అటార్నీ జనరల్ వేతనానికి ఆదాయపన్ను కూడా ఉంటుంది.
1. ఎ, సి 2. బి, సి
3. ఎ మాత్రమే 4. ఎ, బి, సి
24. మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు?
1. సికె దఫ్తరి 2. సోలీ సోరాబ్జి
3. ఎమ్‌సి సెటల్వాడ్ 4. ఎవరూ కాదు
25. తొలి సొలిసిటర్ జనరల్ ఎవరు?
1. సికె దఫ్తరి 2. సోలీ సోరాబ్జి
3. వీజ సెటల్వాడ్
4. తుషార్ మెహతా
26. భారత రాజ్యాంగంలో కాగ్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏవి?
1. 141-151 2. 152-237
3. 148-151 4. ఏదీకాదు
27. కాగ్ తమ రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు?
1. పార్లమెంట్ 2. రాష్ట్రపతి
3. ప్రధానమంత్రి 4. ఎవరూకాదు
28. కింది వాటిలో సరైన వాక్యం/వాక్యాలు గుర్తించండి.
ఎ. కాగ్ అర్హతలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
బి. కాగ్‌గా నియమించిన వ్యక్తికి 10 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉండాలి
1. బి మాత్రమే 2. ఎ మాత్రమే
3. ఎ, బి 4. ఏదీకాదు
29. ”కాగ్” ను భారత రాజ్యాంగంలో అత్యున్నత, ముఖ్యమైన అధికారిగా పేర్కొన్నవారు.
1. నెహ్రు 2. అంబేద్కర్
3. వల్లభారు పటేల్ 4. దీచీ రావ్
30. పబ్లిక్ కమీషన్లను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము.
1. కెనడా 2. బ్రిటిష్ 3. ఐర్లాండ్ 4. అమెరికా
31. లీ కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 1928 2. 1920 3. 1956 4. 1923
32. కింది వాటిలో సరైనది/ సరైనవి ఏవి?
ఎ. యుపిఎస్‌సి ఛైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
బి. యుపిఎస్‌సి ఛైర్మన్ సభ్యుల అర్హతలు నిర్ణయించేది రాష్ట్రపతి
1. ఎ, బి 2. ఎ మాత్రమే
3. బి మాత్రమే 4. ఏదీకాదు
33. ఈ కింది ఏయే సందర్భాల్లో సుప్రీంకోర్టు విచారణ లేకుండా పదవీ కాలం మధ్యలోనే రాష్ట్రపతి యుపియస్‌సి ఛైర్మన్ సభ్యులను తొలగిస్తారు.
1. ఇతర ఉద్యోగం చేపట్టినపుడు
2. జైలు శిక్షకు గురి అయినపుడు
3. దివాలా తీసినపుడు 4. పై అన్నీ
34. యుపియస్‌సి తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
1. పార్లమెంట్ 2. ప్రధానమంత్రి
3. రాష్ట్రపతి 4. కేంద్రహౌంశాఖ
35. మొట్టమొదటి యుపియస్‌సి ఛైర్మన్ ఎవరు?
1. అల్కాసి రోహి 2. హెచ్.కె.కృపలాని
3. కానియా 4. రజనీ రజ్దాన్
సమాధానాలు
1.2 2.2 3.1 4.3 5.2
6.2 7.4 8.2 9.1 10.3
11.1 12.3 13.3 14.1 15.3
16.2 17.2 18.1 19.2 20.1
21.2 22.1 23.2 24.3 25.1
26.3 27.2 28.1 29.2 30.2
31.4 32.3 33.4 34.3 35.2
డాక్టర్ అలీ సార్, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు