నాయకుడంటే..?

నాయకుడంటే..?తెలంగాణ శాసనసభకు ఈ నెల 30న జరిగే ఎన్ని కల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఖరారయ్యారు. అన్ని పార్టీ లు తమ జాబితాను వెల్లడించాయి. ఆ మేరకు అభ్యర్థులకు బి ఫారములు ఇచ్చింది. తమ తమ స్థానాల్లో అభ్యర్థులు ప్రచారజోరును పెంచుతున్నారు. కీలక పోరు, ప్రచా రహోరు ఊపందుకొని దూసుకుపోతున్నారు. ప్రజా పాల కులంటే? ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలు ఎన్నికల్లో ఓట్ల ద్వారా ఎన్నుకోగా పాలకులుగా అధికార పీఠాన్ని అధిష్టి స్తారు. పాలకుల్ని ప్రజలు మోస్తున్నా ప్రజలందరినీ వారు బాధ్యతగా చూసుకోవాలి. ప్రజల కష్టాలను తొలగించి సం క్షేమ, సమ్మిళిత, సమ సమాజాన్ని నిర్మిస్తూ పాలితుల రక్షణ బాధ్యతలు చేపట్టాలి. కన్న తండ్రి ఎలా బాధ్యతతో ఉం టాడో అలా ఉంటూ ప్రజల ప్రీతి పాత్రుడవ్వాలి. ‘బిడ్డ ఏడు పు విన్న తల్లి ఎలా పరిగెడుతుందో.. అలా ప్రజలు ఆపద లో ఉన్నప్పుడు నాయకుడు అలా పరుగెత్తాలి’ అన్నాడు చైనా నేత మావో. అలాంటి వారే నిజమైన ప్రజా సేవ కులు. మంచికై పరితపించడం, ముక్కుసూటితనం నిజమైన నాయకుడి నైజం. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఓర్పు కలిగి ఉండాలి. ఎలాంటి స్వార్థం లేకుండా మంచి పనులు చేయాలి. ప్రజాపాలనంటే.. కల్లబొల్లి మాటలు చెప్పడం కాదు? పారదర్శకమైన ఆచరణే ఆ నాయకున్ని రక్షిస్తుంది. లేకుంటే ఎంతటి నాయకుడైనా ఓటర్ల మన్నన పొందనప్పుడు అగాధంలో పడిపోక తప్పదు. ఇదంతా ఆదర్శానికేనా.. ఆ రాత పూతలకేనా! ఈ ప్రశ్న పాతదైనా నేటికి ఎప్పటికి ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలి పోతున్నాయి. వామపక్షాల పరిపాలనలో ఉన్న కేరళలో తప్ప ఆదర్శ పాలన అనేది దేశంలో ఎక్కడా కానరాదు.
మన రాష్ట్రంలో రాజకీయ పార్టీ(నేత)లు ఈ ఎన్నికల్లో వేస్తున్న ఎత్తులు, జిత్తులన్నీ ప్రజలను ప్రలోభ పెట్టి, అమ లు కాని హామీలతో అధికారపక్షం అధికారాన్ని నిలుపుకో వడానికి, ప్రతిపక్షం ఏదోలా అధికారాన్ని చేపట్టడానికి ప్రజ లపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. కులం, మతం, వర్గాల వారీగా జనాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సకల అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుంటే? ప్రచారహోరు, విమర్శల జోరు పెంచుకుంటూ అభివృద్ధి మాది అంటే! అవినీతి మీది అని? కాదు మీదేనని ఒకరిపై ఒకరు పార్టీ(నాయకు)లు రాజకీయ బురద చల్లుకుంటు న్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎదుటి వారి విమర్శలను స్వీకరించడం, అందులో వాస్తవాలను తెలుసుకోవడం, వారు చెప్పేది కరెక్ట్‌ అనిపిస్తే అది ఆచరిం చడం మంచి నాయకుడు చేసేపని. కానీ ఒకరిని చూసి ఒ కరు అన్నట్టుగా కోట్ల రూపాయలు పోగేసుకోవడం కాదు. నేడు పోటీ చేస్తున్న వారిలో కూడా చాలామంది జాతి సంపదను కొల్లగొట్టిన వాళ్లే?. అభివద్ధి చేశామంటూ చెప్పే నాయకు(పార్టీ)ల చిలుక పలుకులు నేతి బీరలో నెయ్యి చందమే. నిజంగా అభివృద్ధి జరిగింది నాయకులకు మాత్రమే.ఇలాంటి వారు మన నాయకులుగా చెలామణి అవడం శోచనీయం.
నేడు జరుగు తున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఇలాంటి అవకతవకల వల్ల రాత్రికి రాత్రే పార్టీలు మారడం చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పక్షా (నాయ కు)లకు దేశం, రాష్ట్రం మీద గాని ప్రజల మీద గాని ఏ మాత్రమైనా గౌరవ భావం, ప్రేమ, భక్తి ఉంటే? ఏరులై పారుతున్న నల్లధనాన్ని, మద్యాన్ని, ఆల్‌ ఫ్రీ హామీలను నిరోధించేందుకు రాజకీయల్లో విలువల కోసం చేతులు కలపాలి. రాజకీయ పార్టీలన్నీ ధనవంతులనే ప్రజాప్రతి నిధులను చేయాలనుకునే దౌర్భాగ్య సంస్కృతికి చరమ గీతం పాడాలి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆ దిశగా రాజకీయాల్లో నైతిక విలువలు పెంపొందేలా చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. లేకపోతే ఎన్నికలలో పవిత్రత, విలువలు ప్రజాస్వామ్య పరిరక్షణ అందని ద్రాక్ష గానే మిగిలి పోతున్నాయి. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే హీన సంస్కతి క్షమించరాని నేరం. అన్ని పార్టీలు తరతమ భేదా లు లేకుండా యధేచ్చగా ఆ మహా అపరాధానికి ఒడిగడు తున్నాయి. ఇలా కాసుల మూటలతో జనాన్ని ప్రలోభ పెట్టి పార్టీలు దండుకుంటున్న ఓట్లు దేశానికి తీవ్రంగా చేటు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పాలనలో అధికారం పొంద డానికి ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. గెలిచి పదవిలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పు చున్నారు. పార్టీ(నాయకు)లు ఓట్లేసిన ప్రజలను అలా నిలువునా ముంచివేస్తున్నాయి.
జనాన్ని నమ్మించి గొంతు కోసే విధ్వంసక రాజకీ యాలకు అడ్డుకట్ట పడాలంటే!. సామాన్యునికైనా సమాన విలువనిచ్చేలా డాక్టర్‌ అంబేద్కర్‌ అందించిన ”ఓటు” విలువను గుర్తించండి. ప్రజాస్వామ్య సౌధానికి ఓటర్లు పునాదులు. సమాజంలో విలువల రక్షణ కోసం ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించకపోతే, ఈ కుళ్ళు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రలోభాలకు లొంగ కుండా కుళ్లు రాజకీయాలు కడిగేసే పథక రచనకు పూను కోవాల్సింది ముమ్మాటికి ప్రజలే. ఒక్క క్షణం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం.. మరో క్షణం నుంచి నీ జీవిత నాశనానికి పునాది అవుతుంది. కాబట్టి నిత్యం జనాల్లో ఉండే పార్టీ, పేదల కోసం పాటుపడే నాయకుల ఎవరని ఆలోచించి ఓటు వేయాలి.పతనమవుతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.
– మేదాజీ