ఒకవైపు మీకు ఏడు హామీలు, మరోవైపు మోడీ పథకాలు. ఈ ఎన్నికలు అశోక్ గెహ్లాట్ వర్సెస్ ప్రధాని మోడీగా మారాయి. మీరు దానిని ఎలా చూస్తారు?
సీఎం గెహ్లాట్: ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి. ఇక్కడ మోడీ గురించి మాట్లాడకూడదు. ఇది మోడీ ఎన్నికలే కాదు, ఆయనకు ఎలాంటి హామీ లేదు. వారి హామీ 25వ తేదీ వరకు ఉంటుంది. మా హామీలు ఐదేండ్లపాటు కొనసాగుతాయి. వారి వద్ద ఈడీ మాత్రమే ఉంది, మాకు ప్రజలకిచ్చిన హామీలు ఉన్నాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేడి చాలా దగ్గరగా వచ్చింది. మీరు దానిని ఎలా చూస్తారు?
సీఎం గెహ్లాట్: ఈడీ కార్యకలాపాలు కొంత గందరగోళ పర్చే ప్రయత్నం చేసింది. మన ప్రభుత్వం చట్టాలు చేసింది. ప్రణాళికలు తీసుకొచ్చాం. హామీలు ఇచ్చాం. ఓటర్లు దాని గురించి కూడా చర్చించరు. వారికి ధైర్యం ఉంటే చర్చకు రావాలని బీజేపీకి సవాల్ విసిరారు. నాపై ఊకదంపుడు ప్రకటనలు చేశారు . మైదానంలోకి రండి తేల్చుకుందాంటే..చర్చించటానికి ముందుకు రాలేదు. ఏ కేంద్ర మంత్రి వచ్చినా, ఆయన నేతలంతా వచ్చినా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు.
యువతలో పేపర్ లీక్ అనేది పెద్ద సమస్య. ఇది మీకు సవాలు కాదా?
సీఎం గెహ్లాట్: నేను అంగీకరించను. పిల్లలకు సేవ చేశాం. ఏ రాష్ట్రంలోనూ జరగని మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రయాణ చార్జీలు చెల్లిస్తూ వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన ఏర్పాట్లు చేశాం. మేం లీక్ గురించి వ్యక్తిగతంగా ఆందోళన చెందాం. గుజరాత్లో పేపర్ లీకేజీలు ఎక్కువ. నిన్ననే ఒక్కో పేపర్ మూడు సార్లు లీక్ అయిందని చదువుతున్నాను. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పేపర్ లీక్ అవుతోంది. భారతదేశం అంతటా పేపర్లు లీక్ అవుతున్నాచర్యల్లేవ్. కానీ మేం దోషులను
అరెస్టు చేసాం. వారి భవనాలను కూల్చివేసాం. జీవిత ఖైదు నిబంధనతో కూడిన చట్టాన్ని కూడా ఆమోదించింది. ఆ తర్వాత ఎలాంటి పేపర్ లీక్ కాలేదు. చర్యలు తీసుకున్నాం. పిల్లలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. ఈ బీజేపీ వాళ్ళు రెచ్చగొడతారు. ఇదో సమస్యగా మారుతుందన్న భ్రమలో ఉన్నారు. అవును, బాధిస్తుంది. ఎవరైనా ప్రిపేర్ చేసి పేపర్ లీక్ అయితే ఇబ్బంది. వారి సమస్య మన సమస్య.
ఎన్నికల ర్యాలీ ‘సత్తా కే సంగ్రామ్’లో, ఇతర రాష్ట్రాల్లో కూడా పేపర్లు లీక్ అవుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పినప్పుడు, రాజస్థాన్ ఆందోళనలు తగ్గడం లేదని యువత అడ్డుకున్నారు.
సీఎం గెహ్లాట్: యువత పూర్తిగా సరైనదే. ఇతర రాష్ట్రాలలో ఏమి జరుగుతుందో మనం ఏం పట్టించుకుంటాం? దాన్ని సమస్యగా మార్చే ప్రయత్నం చేసే వారికి హక్కు లేదు. సొంత రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అవుతున్నాయి, అక్కడ ఏం చేస్తున్నారు? గుజరాత్లో ప్రధాని ఏం చేస్తున్నారు? యూపీలో యోగి ఏం చేస్తున్నారు? అయితే రాజస్థాన్‌లో చర్య తీసుకోవడం ద్వారా మేం దీనిని చూపించాం.
అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్ కలిసి కనిపిస్తున్నారని, వాస్తవానికి వారు కలిసి లేరని ప్రజలు అంటున్నారు. వారు నిజంగా మీతో ఉన్నారా?
సీఎం గెహ్లాట్: ప్రస్తుతం ప్రతి ఒక్క కాంగ్రెస్ వాది ఐక్యంగా ఉన్నారు, అలా ఉండాలి. నేడు, కాంగ్రెస్ ఐక్యత దేశ ప్రయోజనాల కోసం, రాజస్థాన్ ప్రయోజనాల కోసం , కాంగ్రెస్ ప్రయోజనాల కోసం. దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రజాస్వామ్యం కూలిపోతోంది. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో అన్ని విబేధాలు మరచి ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయడం ప్రతి కాంగ్రెసోళ్ల కర్తవ్యం, ధర్మం.
మీరు సచిన్ పైలట్‌కి ఈ కాల్ చేస్తున్నారా?
సీఎం గెహ్లాట్: …నేను అందరికీ ఈ పిలుపు ఇస్తున్నాను. రాష్ట్రంలోని కాంగ్రెసోళ్లకే కాకుండా యావత్ దేశానికి ఈ పిలుపు ఇస్తున్నాను. ఫాసిస్టు శక్తులు సష్టించిన పరిస్థితుల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చారు. ఏజెన్సీలు నాశనమవు తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అయినా, సీబీఐ అయినా, ఈడీ అయినా దేశ ప్రయోజనాల దష్ట్యా తమ విశ్వసనీయతను కాపాడుకోవడం ముఖ్యం. ఇవి దేశంలోని ప్రధాన ఏజెన్సీలు, కానీ ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం ద్వారా వారి విశ్వసనీయతను నాశనం చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి ఇండ్లకు వెళ్లడం లేదు, దీని వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతోంది.
వేదికపై నుంచి ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ‘పనౌతి’ అని పిలిచారు. ప్రపంచకప్ ఫైనల్లో వారే అంటున్నారు .మోడీ వల్ల భారతదేశం ఓడిపోయింది.
సీఎం గెహ్లాట్: మోడీ జీ ఏం చెబుతున్నారో కూడా చూడండి. ఆయన గురించి రాహుల్ ఏమీ మాట్లాడలేదు. ప్రధాని భాష ఆయన హౌదాకు తగ్గట్టుగా లేదు.
ఆచారాలను మార్చడం గురించి మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు?
సీఎం గెహ్లాట్: కేరళలో 70 ఏండ్ల తర్వాత ఆచారం మారితే, రాజస్థాన్‌లో మాత్రం 30 ఏండ్ల పట్టింది. అక్కడ ఆచారం మారిపోయింది .కమ్యూనిస్ట్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కరోనాలో మంచి పని చేసింది. అటువంటి పరిస్థితిలో, మేము కరోనాలో కూడా మంచి పని చేసాము. దీనితో పాటు ఇతర పనులు కూడా చేశాం. ఉత్తమ చట్టాలను రూపొందించాం. ప్రణాళికలు రూపొందించాం. హామీలు ఇచ్చాం. ఈ విషయం ప్రజల నోళ్లకు వచ్చింది.తప్పకుండా గెలుస్తామని గెహ్లాట్ దీమా వ్యక్తం చేశారు.