తూము కాలువల మరమ్మత్తులు ప్రారంభం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి:  మండలంలోని నాగపూర్ గ్రామంలో ఐసీఐసీఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సోమవారం ఊర చెరువు కాలువలు తూము మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యురాలు దుబ్బాక సుప్రియ, సర్పంచ్ పాలెపు సాయమ్మ మరమ్మతు పనులను ప్రారంభించారు. తుమ్ము మరమ్మతు పనులు నిర్వహిస్తున్న  ఐసీఐసీఐ ఫౌండేషన్ సభ్యులకు గ్రామస్తుల తరఫున ఎంపీటీసీ, సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ ఫౌండేషన్ కమ్యూనిటీ ఫెసిటేటర్ చింత శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ  చైర్మన్ బసకొండ మహేష్,  నీటిపారుదల అధ్యక్షులు ఎలిగేటి గణేష్, ఆయకట్టు రైతులు మల్లేష్, శ్రీనివాస్, మనోజ్, రవి, కిరణ్, బాలు, మల్లయ్య, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.