భారిగా కాంగ్రెస్ లో చేరికలు..

– పార్టీలోకి ఆహ్వానించిన డాక్టర్ భూపతి రెడ్డి..
నవతెలంగాణ- డిచ్ పల్లి
కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు భారీ సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఇందల్ వాయి మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి సమక్షంలో మెగ్యనాయక్ తండాకు చెందిన మాలవత్ దరిసింఘ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,దేగావత్ అమిన నాయక్ బీఆర్ఎస్ యూత్ అద్యక్షుడు తో పాటు సుమారు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎస్టి సెల్ అధ్యక్షడు అంబర్ సింగ్ నాయకత్వంలో ఈ చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దరిసింగ్ 25000 వేల రూపాయల నగదును ఎన్నికల కార్చు నిమిత్తం కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ భూపతి రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.అందరు కలిసి కట్టుగా పనిచేసి గెలుపె ద్యేయంగా కృషి చేయాలని సూచించారు. గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు మైసా దశరథ్,లకావత్ చింటు, మలవాత్ మోహన్,లక్కవత్రి శ్రీనివాస్, లక్కవాత్రి మదు, అంజి, దేగవాత్ జాగురం, మర్కంటి రాజన్న, హరి, హాన్మ, రాంచందర్, చందర్, కన్నిరమ్, సంగ్యా, అంబర్ సింగ్ తో పాటు యెల్లరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిఅర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుట్ట గంగాధర్ సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, ఇందల్ వాయి మండల పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చింతల కిషన్,గంగాధర్, గోపి, తో పాటు తదితరులు ఉన్నారు.