
– ఒక్క పోలింగ్ కేంద్రానికి 828 మంది ఓటర్లు
– నేటి నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది
– నేటికీ 50.32 కోట్ల సీజ్
– జిల్లా ఎన్నికల అధికారి అర్వి. కర్ణన్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈనెల 30న జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు,పోలింగ్ రోజున ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు ను వినియోగించు కోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అర్వి.కర్ణన్ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా ఎస్పి అపూర్వ రావు తో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల సైలెన్స్ పిరియడ్ లో డోర్ టు డోర్ తప్ప ఎటువంటి ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. నేడు సాయంత్రం 5 గంటల నుండి 144 సెక్షన్ అమలు లో వుంటుందని,5 గురు కంటే ఎక్కువ మంది గుమి కూడడం,ప్రచారం చేయడం కానీ చేయరాదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభలు,సమావేశాలు,మైక్ ప్రచారం నిర్వహించ వద్దని తెలిపారు. జిల్లాలో 14,64,080 ఓటర్లు ఉన్నారని,పురుష ఓటర్లు 726169 మంది,737789 మంది మహిళా ఓటర్ లు,122మంది ట్రాన్స్ జెందర్స్ ఉన్నారని తెలిపారు.543 మంది సర్వీస్ ఓటర్ లు ఉన్నారని,18-19 వయస్సు మధ్య 60840 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.80 కి పైగా సీనియర్ సిటిజన్ లు 17424 మంది, పిడబ్ల్యుడి ఓటర్స్ 32007 మంది,ఓవర్ సీస్ ఓటర్ లు 76 మంది, పోలింగ్ కేంద్రం కు సరాసరి 828 మంది ఓటర్ లు ఉన్నారని తెలిపారు. జిల్లా లో 1766 పోలింగ్ కేంద్రాలు,2 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.1271+1 లొకేషన్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు…
ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 5 చొప్పున మహిళా పోలింగ్ సిబ్బంది నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు,ప్రతి నియోజకవర్గం లో 5 చొప్పున ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 30 మోడల్ పోలింగ్ కేంద్రాలు,ప్రతి నియోజకవర్గం లో ఒకటి చొప్పున పిడబ్ల్యుడి పోలింగ్ సిబ్బంది నిర్వహించే ఆరు నియోజకవర్గాల్లో 6 పోలింగ్ కేంద్రాలు,ప్రతి నియోజకవర్గం లో ఒకటి చొప్పున అరు నియోజకవర్గాల్లో 6 యువత నిర్వహించే యూత్ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 556 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు,దేవరకొండ నియోజకవర్గం లో 13 షాడో పోలింగ్ కేంద్రాలు,మును గొడ్ నియోజకవర్గం లో 9 మొత్తం 22 షాడో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు మెడికల్ కిట్, వాలంటీర్స్, ట్రాన్స్పోర్ట్ , క్యూ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 కోట్ల 32 లక్షల విలువ గల నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.
జిల్లా
గ్రీవెన్స్ కమిటీ ద్వారా నగదు, ఇతర వస్తువులు స్వాదీనం చేసుకున్న 261 కేసులకు సంబంధించి 261 కేసులను పరిశీలించి 34 కోట్ల 39 లక్షల 63 వేల నగదు రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో,రిటర్నింగ్ అధికారి కార్యాలయం లలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి పిర్యాదులు స్వీకరించి పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజు రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుండి వెబ్ క్యా స్టింగ్,వాహనాల ను జి.పి.ఎస్ ద్వారా పర్యవేక్షణ, కమ్యునికేషన్ పి. ఓ, లు, సెక్టార్ అధికారుల మధ్య పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు 3079 మంది
పోలీస్ సిబ్బంది,3 ప్లాటూన్ ల టీ ఎస్ ఎస్ పి,19 ప్లాటూన్ ల సిఏపిఎఫ్ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలిపారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 180 రూట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 1211 మంది 80 సం.లు దాటిన వారు,1001 మంది పిడబ్ల్యుడి ఓటర్ లు హోం ఓటింగ్ ద్వారా ఇంటి వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కున్నారని తెలిపారు. విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బంది 8211 మంది,ఇతర జిల్లాలకు చెందిన వారు736 మంది, మొత్తం 8947 మంది ఫారం 12 సమర్పించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినిగోగించుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గం లో డిఅర్సి సెంటర్ ల నుండి ఈవియంల డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ అనంతరం రిసెప్షన్ నుండి తిప్పర్థి మండలం అనిశెట్టి ధుప్పలపల్లి గోదాం కు పోల్డ్ ఈ వియంలు పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూం లకు తరలింపు చేయనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 4 వరకు 144 సెక్షన్ అమలు
– ఇతరులు స్థానికంగా ఉండరాదు
– నేటి నుండి ఈ నెల 30 వరకు, కౌంటింగ్ రోజు మద్యం దుకాణాల బందు
– టోకెన్ విధానంతో మద్యం అమ్మితే చర్యలు
– ఎస్పీ అపూర్వరావు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్.పి.అపూర్వ రావు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నవంబర్ 30న పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు శాంతి యుత వాతవారణంలో నిర్వహించడానికి పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. పెట్రోలింగ్ పార్టీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బందిని నేడు మధ్మాహ్నం 2 గంటల నుండి తరలించడం ( డిప్లయ్) చేయడం జరుగుతుందని తెలిపారు.నేటి సాయంత్రం 5 గంటల నుండి డిసెంబర్ 4వ తేదీ ( సోమవారం ) ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో 5 మంది కంటే ఎక్కువ వ్యక్తులతో ఉండడం నిషేదం అని తెలిపారు.పోలీంగుకు 48 గంటల ముందు నుండే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఇంటింటా ప్రచారం లాంటివి చేయవద్దని పేర్కొన్నారు. ఇతర నియోజక వర్గం నుండి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఏవ్వరూ ఉండకూడదని పేర్కొన్నారు.లాడ్జి లు, గెస్ట్ హౌస్ లు, హోటళ్లలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీ ల వారు నేటి 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లాడ్జీలలో బస చేయడానికి ఎవ్వరయిన హస్పటల్ కు మరి ఏ ఇతర వ్యక్తిగత కారణాలతో వచ్చినట్లయితే వారు పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత అనుమతించాలని తెలిపారు. వారు వచ్చిన సమయం, వెళ్లిన సమయం పూర్తి వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలనని సూచించారు.మద్యం దుకాణ యాజమానులు టోకెన్ విధానంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు, వ్యక్తు లకు మద్యం అమ్మితే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అంతరాయం కలిగించే ఏదైనా మండే పదార్థాం ఉదాహరణకు టపాకాయలు లేదా ఇతర పదార్థాలను తీసుకెళ్లరాదని తెలిపారు. పోలీంగ్ స్టేషన్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న ఇండ్ల యాజమానులు బయటి వ్యక్తులను ఎవ్వరిని అనుమతించకూడదు. అలాగే పోలీంగ్ స్టేషన్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన వారి ఇండ్ల యాజమానులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఓటింగ్ నేపద్యంలో నేటి సాయంత్రం 5 గంటల నుండి ఈనెల 30వ తేదీ వరకు అదే విధంగా కౌంటింగ్ రోజైనా డిసెంబర్ 3 వరకు వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నేటి నుండి డిసెంబర్ 4 ఉదయం 6 గంటల వరకు ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలను విధిగా పాటించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, పై నిబంధనలను ఏ పార్టీవారయిన, ఏ వ్యక్తులయిన ఎవ్వరయిన ఉల్లంఘించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.