నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 1వ తేదీ ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటిం చింది. ఈనెల 29, 30 తేదీల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి ఈ సెలవు వర్తిస్తుందని ఆయా జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడి యట్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలతో పాటు ఇతర శాఖలకూ వర్తిస్తుందనీ, ఆయా విభాగాధిపతులు దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలు ఫాలో కావాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు ఈనెల 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటించారు.