వికలాంగులు సీపీఐ(ఎం)కి ఓటెయ్యాలి…

– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
వికలాంగుల 39 అంశాల డిక్లరేషన్ ను సీపీఐ(ఎం) మేనిఫెస్టోలో పెట్టి వికలాంగుల సమస్యలపై పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ కోరారు. చౌటుప్పల్ మండలం పంతంగి అంకిరెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం, తాళ్లసింగారం గ్రామాలలో మునుగోడు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి గెలిపించాలని వికలాంగుల ఓట్లను అడుగుతూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. వికలాంగుల 39 రకాల అంశాల డిక్లరేషన్  రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలో పెట్టమని అడిగామని కానీ ఏ ఒక్క పార్టీ మా వికలాంగులను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ వికలాంగుల సమస్యలను అక్కున చేర్చుకొని మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వికలాంగులను కోరారు. 30 తేది జరగబోయే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఓడించి సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని గెలిపించాలని వనం ఉపేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవనగంటి నరసింహ,కే.సత్తయ్య, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఎం.యాదయ్య, బి.రాములు, వెంకటేశం, ఎడ్ల రామచంద్రం, స్వాతి తదితరులు పాల్గొన్నారు.