గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హైట్రిక్ విజయం ఖాయం

– ఇంటింటి ప్రచారంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్ : ఆలేరు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హైట్రిక్ విజయం ఖాయం అని బీఆర్‌ఎస్‌ మండల పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కవిడే మహేందర్ అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలంలోని యాసోజ్ గూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలోని ప్రజలందరూ సునీత మహేందర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరే శ్రీనివాస్ గౌడ్, ఎండి ముజిజ్, బొల్లెపల్లి సత్తిబాబు, కుండె క్రాంతి కుమార్, ఆలేరు నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఆరే ప్రశాంత్ గౌడ్, కుండే శ్రీశైలం, బాబు, బిక్షపతి, యాదగిరి, పులేపాక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.