
నవతెలంగాణ-తొగుట : దుబ్బాక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని మెదక్ పార్లమెంటు సభ్యులు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.గురువారం ఎన్నికల సందర్భంగా మండలంలోని గోవర్ధనగిరి, జప్తి లింగారెడ్డిపల్లి,వెంకటరావుపేట, తొగుట లో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తిగాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా కార్యకర్తలు బీఆర్ఎఫ్ పార్టీ శ్రేణులు శ్రేణులు అండగా నిలిచారన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవ డం ఖాయమన్నారు.మూడు ఏళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాకలో ఏం కోల్పోయామో దుబ్బాక ప్రజలు గుర్తించారన్నారు.దుబ్బాక ప్రజ లకు జీవితాంతం సేవ చేస్తూ రుణం తీర్చుకుంటా నని ఆయన పేర్కొన్నారు.ఆయన వెంట సీనియర్ నాయకులు భోంపల్లి మనోహర్ రావు,మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.