ప్రశాంతంగా పోలింగ్… ఊపిరి పీల్చుకున్న అధికారులు..

నవతెలంగాణ-ఆర్మూర్ : శాసనసభ ఎన్నికలలో కీలక ఘట్టమైన పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల సిబ్బంది సామాగ్రితో కేంద్రాలకు చేరుకొని ఉదయం ఏడు గంటల నుండి ఓటర్లు బారులు తీరినారు. మున్సిపల్ పరిధిలోని  మామిడిపల్లి హై స్కూల్ లో 37 వ బూత్ లో ఓటు ఆ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆయన సతీమణి రజిత రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులు పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొదటిసారిగా జీవన్ రెడ్డి కుమార్తెలు ,అనౌశిక రెడ్డి. అనాణ్య రెడ్డి లు ఓటు వేసినారు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి భార్య అనన్య రెడ్డి  వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మండలంలోని అంకాపూర్ గ్రామంలో బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి భార్య రేవతి రెడ్డి, కుమార్తె సుచరిత రెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కును గ్రామ పంచాయితీలో వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని 111 పోలింగ్ కేంద్రాలు,217 పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు ఏడు గంటల నుండి బారులు తీరినారు. ఆలూర్ మండలంలోని దేగాం గ్రామంలో 250 ఓట్లు ఉన్నప్పటికీ రెండే పోలింగ్ బూతులు ఉండడంతో సాయంత్రం తీవ్ర ఆందోళన, సందిగ్గంతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో వృద్ధ మహిళలకు వీల్ చెర సహాయంతో ఓటును వేయించినారు . జిల్లా కేంద్రం నుండి మాక్లూర్ మండలంలోని రామచంద్ర పల్లి గ్రామానికి సంవత్సరం లోపు పాపతో వచ్చి మహిళ ఓటు హక్కును వినియోగించుకుంది.68.34 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.