
– పూలు కేంద్రాలు సాగుతున్న పోలింగ్…
– సాయంత్రం 5 గంటల వరకు 71.8% పోలింగ్…
– కొనసాగుతున్న పోలింగ్…
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజక వర్గంలో సాయంత్రం 5 గంటలు వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.5 గంటలకు 71.8% శాతం పోలింగ్ నమోదు అయినట్లు రిటర్నింగ్ అధికారి,అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. వాస్తవానికి ఈ నియోజక వర్గంలో 4 గంటల వరకే పోలింగ్ అయినప్పటికీ నాలుగు గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు తో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది.ఈ క్రమంలో పోలింగ్ ఈ వార్తా సమయానికి కొనసాగుతుందని తెలిపారు. మాక్ పోలింగ్ కంటే ముందే 12 ఈ.వీ.ఎం లు మొరాయించాయి.వాటి స్థానంలో కొత్తవి అమర్చారు.పోలింగ్ ప్రారంభం అయ్యాక పలు కేంద్రాల్లో ఈ వీ ఎం లు మొరాయించి,మరమ్మత్తులు అనంతరం పని చేసినట్లు పలువురు ఏజెంట్ లు తెలిపారు. పోలింగ్ సరళిని సీపీఐ(ఎం), కాంగ్రెస్,బీఆర్ఎస్ అభ్యర్ధులు అర్జున్ రావు,జారే ఆదినారాయణ,మెచ్చా నాగేశ్వరరావు లు పరిశీలించారు.