భారత్‌ పరువు మంట కలిసింది

Honor of India The fire caughtఅవును భారత్‌ పరువు మంట గలిసింది. ఇదేదో నేను ప్రపంచకప్‌ క్రికెట్లో భారత్‌ ఓడిందని చెప్పడం లేదు. దేశ పరువు అంతర్జాతీయంగా మట్టి పాలైంది. ఒక వైపు టీవీ ఛానెల్స్‌ మోడీ మహాన్‌ అని ఊదరగొడు తుంటాయి. ఒకరేమో పలానా అధ్యక్షుడు మోడీ కాళ్లు మొక్కాడని, ఇంకొకరేమో అమెరికా అధ్యక్షుడు మోడీతో చేయి కలపడానికి పరితపించి పోతున్నాడని, ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, మోడీ ఫోన్‌తో కొన్ని గంటల పాటు ఆగిందని (అక్కడ ఇరుక్కున్న భారతీయులని తేవడానికి) చెబుతాయి. అయితే ఆ తరువాత విదేశీ మంత్రాల యమే అలంటిదేమీ లేదని వివరణ కూడా ఇచ్చింది. మరొకరేమో మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అనిచెవులు చిల్లులు పడేలా చెబుతుంటారు. కానీ అది వాస్తమేనా? కాదని వార్తలు చెబుతున్నాయి. నిజానికి జరిగిన దేమిటంటే నవంబర్‌ 23న రాజస్థాన్‌కు ఎన్నికలు జరి గాయి. అదే రోజు మన గౌరవనీయ ప్రధాని యుద్ధ విమా నం ‘తేజస్‌’ లో విహరించడానికి బెంగళూరులో ఉన్నారు. మన చానెల్స్‌ మాత్రం మోడీ ‘తేజస్‌’ ని నడుపు తారని పేర్కొన్నాయి. అసలు విమానం నడపడమే కష్టతరం. ఎంతో శిక్షణ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాంటిది ఒక యుద్ధ విమానాన్ని నడపడమంటే మాట లా? సరిగ్గా అదే రోజు శత్రువుల దాడికి గురై వీరమర ణం పొందిన సైనికుల్లో ఒక కెప్టెన్‌కి బెంగళూరులోనే అంత్యక్రియలు జరుగుతున్నాయి. బెంగుళూరులోనే ఉన్న ప్రధానికి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరుడి కుటుంబానికి, సాంత్వన పలకటానికి సమయం లేదు. కానీ తేజస్‌లో విహరించండానికి సమయముంది..
సరే అదంటుంచితే అదే రోజు అంతర్జాతీయంగా ఒక సంఘటన జరిగింది. ఐక్య రాజ్య సమితిలో ఒక భాగమైన యునెస్కోలో వోటింగ్‌ జరిగింది యునెస్కో అంటే ఐక్యరాజ్య విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ. ఇది విద్య, శాస్త్ర రంగాలతో పాటు సాంస్కృతిక రంగాలలో పని చేస్తుంది. ముఖ్యంగా పాత కట్టడాలు, దేవాలయాల గుర్తింపు. అగ్రా తాజ్‌మహల్‌, వరంగల్‌లోని రామప్ప దేవాలయం, తంజావూర్‌లోని బృహదీశ్వర ఆలయం, గుజరాత్‌లోని మెట్ల బావి, ఇవన్నీ కూడా యునెస్కో గుర్తింపు పొందినవే. ఇందులో 58 మంది సభ్యులుం టారు. ఒక అధ్యక్షుడితో పాటు వివిధ ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఉపాధ్యక్షులు ఉంటారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల ఉపాధ్యక్షుడి కోసం 23 నవంబర్‌ 2023 నాడు ఓటింగ్‌ జరిగింది. పోటీలో ఇద్దరే ఉన్నారు ఒకరు భారత అభ్యర్థి అయితే మరొకరు పాకిస్తాన్‌ అభ్యర్థి. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల పూర్తి బాధ్యత ఆ ఉపాధ్యక్షుడిదే. మీరేం అనుకుంటున్నారు… భారత్‌ గెలిచిందనుకుంటున్నారా?’ అయితే పప్పులో కాలేసినట్లే. ఆ ఓటింగ్‌లో భారత్‌ ఓడిపోయింది. ఏదో మామూలుగా ఒకటి రెండు ఓట్లతో కాదు. అత్యంత ఘోరంగా 20 ఓట్ల తేడాతో ఓడిపోయింది. యునెస్కో వున్నా 58 మంది సభ్యుల్లో ఈ ఇద్దరు పొతే మిగిలిన ఓట్లు ఈ 56గురు ఓటేస్తే భారత దేశానికి 18 ఓట్లు ఒస్తే పాకిస్తాన్‌కి ఏకంగా 38 ఓట్లు పడ్డాయి. అంటే 20 ఓట్ల తేడా! ఇదీ మన భారత్‌ ప్రతిభ. ఈ విషయం ఏ మెయిన్‌ స్ట్రీమ్‌ న్యూస్‌ ఛానెల్‌లో లేదు. ఒకవేళ పత్రికల్లో వచ్చివుంటే మెయిన్‌ పేజీలో మాత్రం వచ్చి ఉండదు, లోపలి పేజీల్లో ఎక్కడో నాలుగైదు లైన్ల వార్తగా వచ్చి వుంటుంది.
తిండికి కూడా గతిలేని స్థితిలో ఉంది పాకిస్తాన్‌ అని మనం ఊదరగొడుతుంటాం. కానీ తిండిలేని పాకిస్తానే అంతర్జాతీయంగా మేనేజ్‌ చేసి ఏకంగా 38 ఓట్లు, మన కంటే 20 ఓట్లు ఎక్కువ పొందింది. దీన్నేమంటారు? మరో విషయం కూడా చెప్పుకోవాలి. నేపాల్‌, భూటాన్లు భారత్‌కి మిత్ర దేశాలుగా ఉండేవి. వాటికి భారతదేశం ఎంతో సహాయ సహకారాలు అందించింది. ఆదేశాలకి విద్యుత్తుని సప్లై చేసింది. ఆ దేశాల్లోని పర్వత ప్రాంతాల్లో (హిమాలయాల్లో) డ్యాంల నిర్మాణానికి ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందించింది. వాటికి కావాల్సిన నిత్యావ సరాల వస్తువులు భారతదేశం నుండి వెళ్ళేవి. అలాంటి దేశాలు నేడు చైనా అంటకాగుతున్నాయి. అంతెందుకు వేలెడంత లేని దేశం మాల్దీవులకి, ఆహారధాన్యాలతో పాటు ఆదేశ రక్షణ కూడా భారతదేశానిదే. మాల్దీవులను ఆ చుట్టుపక్కల దీవులను రక్షించడానికి భారత్‌ సైన్యాలు అక్కడ ఉంటున్నాయి. ఈ మధ్యే అక్కడ ఎన్నికలు జరి గాయి. అయితే అక్కడ ఎన్నికలు జరిగిన తరువాత ఎన్నికైన అధ్యక్షుడు త్వరలోనే భారత సైన్యాలను వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పాడు. ఇది దేనికి నిదర్శనం. భారత పరువు పెరిగిందా.. లేక తరిగిందా?
ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రశ్న వైరల్‌ అయింది. అదేమిటంటే… మోడీ చేయలేనిది ఏమిటీ అని… దానికి జవాబుగా ఓ పెద్ద లిస్టే ఉంది. అందులో కొన్ని… మోడీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ చేయలేరు, భారత ఆర్థిక వ్యవస్థని సరిదిద్ద లేరు. ధరలు తగ్గించలేరు, ఇజ్రాయెల్‌ పాలస్తీనా యుద్ధం ఆపలేరు. ఇలాంటివే ఒక చాంతా డంత ఉంది. ఇదీ మన మోడీ మహాన్‌ మహిమ.
సేకరణ: జయప్రకాష్‌
8374851426