బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు

నవతెలంగాణ-నిర్మల్‌
నిర్మల్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై గురువారం కేసు నమోదైంది. నిబంధనలకు వ్యతిరేకంగా తన స్వగ్రామమైన నిర్మల్‌ మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో పోలింగ్‌ బూత్‌లో పార్టీ కండువా కప్పుకొని ఇంద్రకరణ్‌రెడ్డి ఓటు వేశారని నిర్మల్‌ రూరల్‌ ఎస్‌ఐ తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, ఇతర పార్టీల అభ్యంతరం మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు.