నవతెలంగాణ-పెద్దవూర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నోముల నర్సింహయ్య అని నాగార్జున్ సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు. మాజీ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన కుమారుడు, నాగార్జున్ సాగర్ ఎంఎల్ఏ భగత్, కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిచారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రాంచంద్రనాయక్, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజేందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు సాదం సంపత్ కుమార్, నిడమానూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి , ఎంపీపీలు భగవాన్ నాయక్, బొల్లం జయమ్మ, గుండేబోయిన కోటేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పిడగం నాగయ్య, కురాకుల వెంకటేశ్వర్లు, రవి నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, పెద్ద బోయిన శ్రీనివాస్, మైనారిటీ నాయకుడు అబ్బాస్, కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, కో ఆప్షన్ మెంబర్ చాపల సైదులు, హైమద్ అలీ, మహిళా అధ్యక్షురాలు మాద ధనలక్ష్మి, కళావతి, గ్రామ పార్టీ అధ్యక్షులు జంగలి శ్రీనివాస్, బైరం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.