నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ నుంచి చలమల్ల కృష్ణారెడ్డి పోటీ చేశారు.మొదట్లో త్రిముఖ పోటీ నెలకొన్న ప్పటికీ చివరిలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు కొనసాగింది.మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డికి కలిసి వచ్చిన అంశం ప్రధానంగా మూడు ఉన్నాయి ఉప ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,000 లపై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.నా రాజీనామా ద్వారా మునుగోడుకు సుమారు దాదాపు 600 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి.గట్టుప్పల్ మండల కేంద్రంగా ఏర్పడింది.చండూరు డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు.చర్లగూడెం, లక్ష్మణపురం బాధితులకు డబ్బులు వచ్చినాయి. ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,సిసి రోడ్ల పనులు జరిగాయి.అందులో భాగంగానే ఉప ఎన్నికలో ప్రజాప్రతినిధులకు, ఓటర్లకు డబ్బులు బాగానే ముట్టినాయి.ఇంతవరకు బాగానే ఉన్నా ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం రాజగోపాల్ రెడ్డి డబ్బులు,పేరు పోవడం మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోయారు.చివరకు 18 వేల కోట్లకు భారతీయ జనతా పార్టీకి అమ్ముడుపోయాడని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి ఆయన ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కడ పోయినా మూడే మూడు మాటలు పదేపదేగా చెప్పుకుంటూ ప్రచారం నిర్వహించారు. అవి ఏంటంటే నా ద్వారా మునుగోడుకు నిధులు వచ్చాయి ప్రజాప్రతినిధులకు డబ్బులు వచ్చాయి. ఓటర్లకు డబ్బులు చేరాయి.నన్ను ఓడ గోట్టారు నా డబ్బులు పోయినాయి 18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ప్రచారం జరిగింది.అప్పుడు నేను నా భార్య కొడుకు చాలా బాధపడ్డారు చాలా ఏడ్చారు.అని చెప్పుకుంటూ ప్రచారం నిర్వహించారు .నా ద్వారా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి చెందింది ప్రజలు బాగుపడ్డారు నన్ను ఈ ఒక్కసారి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మునుగోడు నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అభివృద్ధి ఏంటో ఎలా ఉంటదో చేసి చూపిస్తాను అని ప్రజలకు హామీలు ఇస్తూ ప్రచారం నిర్వహించారు.ఉప ఎన్నికలో అత్యధికంగా ఓట్ల పర్సెంటేజ్ నమోదయి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు.ఇప్పుడు కూడా 91.89% ఓట్లు పోలై రాష్ట్ర చరిత్రలోనే మునుగోడు మరొకసారి నిలిచింది.కానీ ఈసారి అత్యధిక మెజారిటీ ఇచ్చి మునుగోడు నియోజకవర్గ ఓటర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని సంకేతాలు ఇస్తున్నాయి.అందులో భాగంగానే మునుగోడులో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెజారిటీతో గెలవబోతున్నాడని సర్వేలు తెలుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మునుగోడులో ఎవరు గెలుస్తారో నేడు తెలువబోతోంది