మురళి నాయక్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు

 

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్

– వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్
నవతెలంగాణ- నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ గెలుపు కోసం కష్టపడి కృషిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు అని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ వైస్ ఎంపీపీ జేల్లా వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి మద్ది రాజేష్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్ మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య మాజీ సర్పంచ్ పట్నం శెట్టి నాగరాజు అన్నారు మండల కేంద్రంలోని వివిధ గ్రామ కాంగ్రెస్ర్ పార్టీ అధ్యక్షులతో కలిసి శనివారం సమావేశాన్ని గ్రహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిగా నియమించడంతోనే కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చిందని అన్నారు కొద్ది సమయంలోనే నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి గడపగడపకు తిరిగి టైం లేకపోయినా ఆయన ప్రజల మనసును గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామాల్లోని మండలంలోని కార్యకర్తలను కలుపుకొని ఈ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ప్రచారంలో ముందుకు సాగర్ అని అన్నారు ఆయన గెలుపు కోసం కష్టపడి కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమంది తినడానికి సమయం లేకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటారని అన్నారు నేడు గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు గెలవబోయే ఎమ్మెల్యే మురళి నాయక్ తోనే మహబాబ్ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఆయన గెలుపు కోసం కృషి చేసిన  నియోజకవర్గంలోని ప్రతి మండల నాయకులకు గ్రామ నాయకులకు వివిధ గ్రామాల కమిటీల నాయకులకు ప్రత్యేక పాదాభివందనాలని తెలిపారు ఎదుటి వ్యక్తి చేసిన అవినీతిని ఎదుర్కొనేందుకే కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లిన ఓటరు దేవుళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు ప్రతి కార్యకర్తలను గుర్తు పెట్టుకొని వారిని కాపాడుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ యాకన్న స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య తొర్రూర్, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాదాద్రి నెల్లికుదురు పిఎసిఎస్ వైస్ చైర్మన్, టాన్ సింగ్, మాజీ సర్పంచ్, భోజ్జ్యా నాయక్, బాలాజీ నాయక్, దేవేందర్ రెడ్డి, పెరుమాండ్లశంకర్, కృష్ణ, వివిధ గ్రామల శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.