శాంతి కోసం

“The blood of innocents flowed freely like a river swollen with injustice” and “for days the city endured terror, misdeeds darker than night itself descended”
– Ghalib
పాలస్తీనా
పాలస్తీనా
పసిపాపల
కలవరింతలో
నువ్వొక కలగానైనా
రాగలవా?

ఈ నేలను బూడిద చేసి
పసిపాపల నెత్తుటితో
యుద్ధమాడుతున్న
వానికి ఎవరు చెప్పగలరు?
వాడి వికట్టాట్టాసాల వెనక
వాడి పొగరుబోతు మాటల వెనక
ఎంతటి క్రూరత్వం!

గాజా నగరం
చీకటి కమ్ముకున్న
చందమామలా
నెత్తుటి మరకలతో
దు:ఖిస్తున్నది

క్రీస్తు పవిత్ర స్నానమాచరించిన
జోర్డాన్‌ నది ఎండిన
గాజా నెత్తుటి
చారికలతో నిండుకున్నది
ప్రవక్తల గొంతులన్నీ
ద్ణుఖంతో పూడుకున్నవి

వాడికొక్కటే ధ్యాస
ఈ నేలను దురాక్రమించాలని
మాదొక్కటే ఆశ
మిగిలిన ఈ నేలను
చివరి శ్వాస వరకు
వీడిపోరాదని..

గెలుపు కాదు
శాంతి కోసమే
ప్రతిఘటనని!!
– కెక్యూబ్‌ వర్మ, 9493436277