కత్తులు పూస్తున్న కొమ్మలు

కత్తులు పూస్తున్న కొమ్మలుజాలి చూపులతో.. కళ్ళనీరు కళ్ళలోనే ఇంకించుకుంటూ.. ఎందుకుంటావ్‌ !? బాధలన్నీ నీకేనని..భారమంతా మోస్తున్నానని.. తలుస్తున్నావా?
నీవిక ఏమీ చేయలేవు
ఒడిదుడుకులు లేని ప్రవాహం..బాధలు లేని బ్రతుకుంటుందా..?
జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు –
సృష్టిని చూడు దృష్టి మార్చు -ప్రకృతి అంతాపాఠమే –
జీవమున్న ప్రతిదీ చైతన్యమే..!
స్థితి ఎలా ఉన్నా – పరిస్థితులు ఏవైనా –
కోల్పోకు మానసిక స్థైర్యం – కూడగట్టుకో ధైర్యం.
ఎదురీత దిశ మారుతుంది..రాత రాగమవుతుంది..
సానుభూతికొరకు చూపులు వృధా చేయకు..
సాధించాలని – ఛేదించాలని – రాణించాలని –
బతకాలని – బతికించాలని భావించు…
యోచన మారితే
వివేచన అవుతుంది.. నీవేమిటో నెమరేసుకో
రెక్కలు మొలిచిన పక్షివి…
నెత్తురు మండే పిడికిలివి ..
అవసరమైతే ”సంఘటితమవ్వు”
చురకత్తిలా మారు
– గడ్డం సులోచన, 7702891559