ఆలోచన చేయకపోతే అనర్థాలే ఎదుర్కొంటం…

– ధైర్యంతో ఒక్క అడుగు వేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటం
– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ-మంథని
ఎన్నికల సమయంలో ఆగమై ఆలోచన చేయకుండా ఓట్లు వేయడం మూలంగా అనర్థాలే ఎదుర్కొంటామని పెద్దపల్లి జిల్లాపరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు.మంథని మండలం గద్దలపల్లి గ్రామపంచాయతీ ధర్మారం వాసులు, నాయకులు,కార్యకర్తలు,బిఆర్ఎస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు ఏగోలపు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశమై ఈసారి జరిగే ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ను గెలిపించుకునేలా సమిష్టిగా పనిచేయాలని నియోజకవర్గమంతా పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ ఆలోచన చేసి ఓటు వేయకపోవడం మూలంగానే 40ఏండ్లుగా ఒక్క కుటుంబంతోనే ఇబ్బందులుపడుతున్నామని అన్నారు.కేవలం అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి ఒక్క కుటుంబమే పరిపాలన చేస్తుందని,మన ఆకలి,మన కష్టాలు పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.కాటారం మండలానికి ఏం చేయకపోయినా అక్కడి ప్రజలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు,ఆ కుటుంబానికి మెజార్టీ ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అనేక ఏండ్ల తర్వాత నియోజకవర్గానికి బీసీ బిడ్డగా తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అనేక అభివృద్ది పనులు చేశామని,ఎన్నో సేవలు అందించామని గుర్తు చేశారు.నాలుగేండ్లలో తాము చేసిన అభివృధ్ది,సేవలు కళ్లముందే కన్పిస్తున్నాయనే విషయాన్నిప్రతి ఒక్కరు గమనించాలన్నారు.అన్నం పెట్టినోళ్లకు అండగా నిలువాలని ఆలోచన చేసిన ధర్మారం వాసులు ఎంతో గొప్పవారని,వారిని నియోజకవర్గమంతా ఆదర్శంగా తీసుకురావాలన్నారు.మనం ఓటు వేసి ఎన్నుకునే నాయకుడికి మంచి ఆలోచన ఉంటే మనమే బాగుపడుతామని,తమ స్వార్థం కోసమే పనిచేసే నాయకుడు ఉంటేఒక్క కుటుంబ పాలనలో ఎలా ఇబ్బందులు పడుతున్నామో మళ్లీ అదే జరుగుతుందన్నారుఇన్నాళ్లు తన గెలుపుకోసం ఎమ్మెల్యే కిందస్థాయి నాయకులను,కార్యకర్తలను వాడుకుని వదిలేయడంతో రోడ్డున పడ్డోళ్లు ఎంతో మంది ఉన్నారని,ఎన్నికల్లో ఎమ్మెల్యే చేసిన నిర్వాహాల మూలంగానే ఈనాడు సర్పంచ్‌లు,ఎంపీటీసీలు అప్పులపాలవుతున్నారని ఆయన వివరించారు.ఒక గ్రామసర్పంచ్‌ను గెలిపించుకోవాలంటే అతని కులం,బలం చూస్తామని,అదే ఎమ్మెల్యే విషయంలో ప్రజలు ఎందుకు ఆలోచన చేయడం లేదన్నారు.అత్యధిక శాతం ఉన్న మనం తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్లకే 40ఏండ్లుగా అధికారం అప్పగిస్తున్నామని ఆయన వాపోయారు.ఈనాటికి తాను ఏ ఊరు వెళ్లినా బంధుత్వంతో పిలుస్తారని,కానీ సారుకు ఎక్కడకు పోయినా సారు అంటారే తప్ప ఎవరైనా బంధుత్వంతో పిలుస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ సంఖ్యలో మన ఉన్న మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే సర్పంచ్‌లు,ఎంపీటీసీలకు రూపాయి ఖర్చు లేకుండా గెలిపించుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని, ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోయినా తాను ప్రజల మధ్యనే ఉన్నానని గుర్తు చేశారు.ప్రస్తుత ఎమ్మెల్యే గెలిచాక పట్టణాలకే పరిమితమయ్యాడని, ఏ అవసరం ఉన్నా కార్యకర్తలు, నాయకులు వేల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్‌ పోయి కలిసేవారని అన్నారు.కానీ తాను ఎమ్మెల్యేగా అయితే అలాంటి పరిస్థితులులేకుండా తాను చేశానని,ఈనాడు తనను కలువాలంటే పైసా ఖర్చు కాకుండా నిత్యం అందుబాటులో ఉన్నానని ఆయన గుర్తు చేశారు.2013లో జరిగిన మంథని గ్రామపంచాయతీ ఎన్నికల్లో మంథని ప్రజల ఇచ్చిన తీర్పు నియోజకవర్గానికి వెలుగులు నింపాయని అన్నారు.ఈసారి కూడా అదే తరహాలో ధర్మారంవాసులు తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో మార్పుకునాందికావాలన్నారు.రాబోయే రోజుల్లో మంథని కాంగ్రెస్‌ నుంచి ఒక్క కుటుంబానికి అవకాశం ఉండకుండా ఒక బీసీ సామాజిక వర్గ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేలా ప్రజల తీర్పు ఉండాలని,తాను ఏనాడు వారసత్వ రాజకీయాల గురించి,తానే మరోపదేళ్లు ఎమ్మెల్యేగా ఉండాలని ఆశ లేదని,తన తర్వాత మరో అట్టడుగు వర్గానికి చెందిన నాయకుడు అసెంబ్లీలో పెట్టాలన్నదే తన ఆకాంక్షఅని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్,నాయకులు జక్కు రాకేష్,ముత్యాల లింగయ్య,సర్పంచ్ బుద్ధర్తి.రవి,ఎంపిటిసి తుంబూరపు సుజాత- తిరుపతి,అంబీర్ బాపు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.