– ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
– కాల్వపల్లి లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ- తాడ్వాయి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క అన్నారు. ఆదివారం మండలంలోని కాల్వపల్లి గ్రామంలో నూతన కాంగ్రెస్ గద్దె ను నిర్మించి, కాంగ్రెస్ జెండా ను పిఎసిఎస్ డైరెక్టర్ ఆషాడం మల్లన్న అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సీతక్క మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. జూడో యాత్ర ద్వారా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి అందరి ప్రజల మనోభావాలను, కష్టసుఖాలను తెలుసుకున్నామని, దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా మారిందన్నారు. అనంతరం కాల్వపెళ్లిలో జరుగుతున్న బడే రవి- లావణ్య నూతన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి గాలి దుమార భీభత్సవానికి కాల్వపల్లి లో ఇండ్ల పైకప్పులు లేసిపోయి, గోడలు కూలి, నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ఆషాడ మల్లయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ సిద్దబోయిన శ్రీనివాస్, నాయకులు కుడుముల సారయ్య, పురుషోత్తం నారాయణ, అంబటి ఓదేలు, పరీశెనేని నరసింహులు, సిద్ధబోయిన నర్సింగరావు, కుడుముల సుగుణ, పుల్లక్క, గోపనబోయిన ఓదెలు, గంగుల నరేష్, కొప్పుల జగన్నాధ రావు, బడే యాదగిరి, మద్దూరి రమేష్, వెంకటయ్య, భూషబోయిన పుల్లయ్య, వెంకటయ్య, సతీష్, సమ్మయ్య, పురుషోత్తం, రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు.