– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్షాల ఇండియా కూటమిని బలోపేతం చేయాల్సిన అవసరం దేశానికి ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ‘ఇండియా’ మరింత బలోపేతం కావాలన్నారు. ఇందుకోసం సీపీఐ(ఎం) ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. సోమవారం నాడిక్కడ సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా బ్లాక్‌లోని అన్ని పార్టీల సీనియర్ నేతలు పరస్పరం సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి సమన్వయ కమిటీలో సభ్యులుగా లేకపోవడం అడ్డంకి కాదు. జెడీఎస్ కేరళ యూనిట్ జాతీయ నాయకత్వానికి పూర్తిగా దూరమైంది. సాంకేతికంగా మాత్రమే ప్రస్తుతానికి కేరళలో జేడీఎస్‌గా కొనసాగుతున్నారు’ అని అన్నారు. జాతీయ రాజకీయ పరిస్థితులతో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ నిర్మాణ అంశాలపై శుక్రవారం నుంచి జరగబోయే సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.