8న మండల సాధారణ సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి

ఈనెల 8వ తేదీన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సంతోష్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు  ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి అధ్యక్షతన ఈ మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.  సమావేశానికి మండల స్థాయి అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధి నివేదికలను 25 కాఫీలా  జిరాక్స్ ప్రతులను  ఈనెల 7వ తేదీలోగా  మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. సమావేశానికి మండలంలోని ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సకాలంలో హాజరై సహకరించాలని ఈ సందర్భంగా ఎంపీడీవో కోరారు.