నీటి గింజల పంట” ఆవిష్కరణ

కంచరాన భుజంగరావు కవితా సంపుటి ”నీటి గింజల పంట” ఆవిష్కరణ శ్రీకాకుళంలోని గ్రాండ్‌ హోటల్‌లో మే 27 శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. అట్టాడ అప్పలనాయుడు అధ్యక్షతన కె. శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. జి లక్ష్మి నరసయ్య ముఖ్య అతిథిగా, పుప్పాల శ్రీరాం, అనిల్‌ డ్యాని సమీక్షకులుగా, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ తిరుమల చైతన్య, గంటేడ గౌరునాయుడు, కొప్పల భానుమూర్తి తదితరులు హాజరు కానున్నారు.

– సిక్కోలు బుక్‌ ట్రస్ట్‌, శ్రీకాకుళ సాహితి.