సాటాపూర్ చౌరస్తాలో కుక్కల సైర విహారం..

 

– భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు, ఇటీవల ముగ్గురు చిన్నారుల పై దాడి..

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో 8 నుంచి 10 ఊర కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత మూడు రోజుల కిందట ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. స్థానిక గ్రామపంచాయతీ అధికారులు గాని, సంబంధిత శాఖ వారు కుక్కల నివారణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.